జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ అంటూ కమెడియన్ గా పరిచయమై అక్కడ బాగా పాపులర్ అయ్యి మిగతా షోస్ అంటే ఢీ డాన్స్ షో, అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలతో ఈటీవిలోనే స్టార్ గా ఎదిగిన సుధీర్ కొంతకాలంగా ఈటీవిని వదిలేసాడు. కారణం వెండితెర మీద హీరో అవతారమెత్తాడు. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా కనిపించిన సుధీర్ ఆ తర్వాత హీరోగా మారాడు. సాఫ్ట్ వేర్ సుధీర్, గాలోడు, కాలింగ్ సహస్ర, G.O.A.T అంటూ పలు సినిమాలు చేసాడు.. చేస్తున్నాడు. అందులో సుధీర్ కి ఒక్క సక్సెస్ కూడా రాలేదు. కాకపోతే గాలోడు డివైడ్ టాక్ తోనే కోట్లు కొల్లగొట్టింది.
ఇక తాజాగా సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర మూవీ కామ్ గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే క్యాష్ ప్రోగ్రాం లో సుధీర్ టీమ్ హడావిడి తప్ప మరేది లేదు. కాలింగ్ సహస్ర శుక్రవారం విడుదలవుతున్న విషయం ప్రేక్షకులకి పెద్దగా తెలియదు. అసలే హిందీ నుంచి వచ్చిన యానిమల్ సునామి మిగతా సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి లేకుండా చేసింది. దానితో నిన్న విడుదలైన కాలింగ్ సహస్రపై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కనిపించలేదు.
ఇక సినిమా విడుదలయ్యాక పూర్ రివ్యూస్, రేటింగ్స్, పబ్లిక్ నుంచి డివైడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. బుల్లితెర మీద సక్సెస్ అయిన సుధీర్ సిల్వర్ స్క్రీన్ మీద మాత్రం అంతగా సక్సెస్ అవ్వలేకపోయాడు. మరి కాలింగ్ సహస్ర పరిస్థితి అలా అంటే.. రేపు రాబోయే G.O.A.T ఏం చేస్తుందో చూడాలి.