Advertisementt

BB7: లాస్ట్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు

Mon 04th Dec 2023 05:09 PM
pallavi prashanth,amardeep  BB7: లాస్ట్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు
BB7 Telugu 14th Week Nominations Promo BB7: లాస్ట్ నామినేషన్స్ లో రెచ్చిపోయారు
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 మరో రెండు వారాల్లో ముగింపు దశకు చేరబోతోంది. డిసెంబర్ 17 న గ్రాండ్ ఫినాలేకి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో ఎవరు విన్నర్ అవుతారో ఎవరు టాప్ 5 కి వెళతారో అనే విషయంలో ఇప్పటికే ఆడియన్స్ లో ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసారు. విన్నర్ గా పల్లవి ప్రశాంత్, రన్నర్ గా శివాజీ నిలిచే అవకాశాలున్నాయంటూ పోల్స్ చెబుతున్నారు. టాప్ 5 లోకి ఇప్పటికే అర్జున్ అంబటి ఎంటర్ అవగా.. తర్వాత పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రియాంకలు టాప్ 5 లోకి వెళ్లే ఛాన్స్ ఉండగా.. శోభా శెట్టి, యావర్ లు ఈ వారం ఎలిమినేట్ అవుతారని అంటున్నారు.

ఇక హౌస్ లో చివరి నామినేషన్స్ లో హౌస్ మేట్స్ మధ్యన తీవ్రమైన గొడవ జరిగింది. ఈ వారం అమర్ దీప్ ని హౌస్ మేట్స్ చాలామంది టార్గెట్ చేసారు. ముఖ్యంగా ఆయన ఫ్రెండ్ ప్రియాంకనే అమర్ ని నామినేట్ చెయ్యడం హాట్ టాపిక్ కాగా.. ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్ - అమర్ ల మధ్యన ఫైట్ జరిగింది. ఎందుకో అమర్ అన్న నీకు నేను మొదటి నుంచి ఇష్టం లేదు అన్నాడు పల్లవి ప్రశాంత్, నువ్వు మోసం చేసావ్ అంటే నువ్వు మోసం చేసావంటూ కొట్టుకునే వరకు వెళ్లారు

ఇక శివాజీ శోభా శెట్టి ని, ప్రియాంకని కలిపి ఏసుకున్నాడు. అమర్ ని నువ్ నామినేట్ చెయ్యవు, ఫౌల్ ఆడిన అతన్ని వదిలేసి న్బన్ను చేస్తున్నావ్ అంటూ శోభపై విరుచుకుపడగా.. అర్జున్ అమర్ దీప్ ని నామినేట్ చేస్తూ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారవా అన్నాడు. ఆ తర్వాత యావర్ తో అర్జున్ గొడవపడ్డాడు. శోభకు యావర్ కి ఎప్పటిలాగే పెద్ద గొడవ జరిగింది. లాస్ట్ వీక్ వచ్చేసింది. హౌస్ లో ఉండేది రెండు వారాలే.. చివరి నామినేషన్స్ ఎవ్వరు ఏమనుకుంటే మనకేంటి అన్నట్టుగా హౌస్ మేట్స్ గొడవలు పడిన ప్రోమోస్ వైరల్ అయ్యాయి 

BB7 Telugu 14th Week Nominations Promo:

Bigg bOss 7: Pallavi Prashanth Vs Amardeep

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ