టాలీవుడ్ లో మెగా పీఆర్వో అంటూ మెగాస్టార్ తో పాటే కాకుండా మెగా హీరోలకి దగ్గరగా ఉండే సురేష్ కొండేటి తన సోషల్ మీడియాలో అకౌంట్ లోను మెగా పీఆర్వో అనే వేసుకుంటాడు. మెగా హీరోలకి దగ్గరగా ఉండే సురేష్ కొండేటి నిజంగానే మెగా పీఆర్వో అని అందరూ నమ్మేస్తారు. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ట్రెండ్ అవుతున్నాడు. మూవీ ప్రెస్ మీట్స్ లో అర్ధం పర్ధం లేని ప్రశ్నలు అడుగుతూ యూట్యూబ్ ఛానల్స్ లో హైలెట్ అయ్యే సురేష్ కొండేటి నిర్మాత కూడా. ఇక తన వారపత్రిక సంతోషం పేరిట టాలీవుడ్ లో అవార్డుల ప్రధానం చేస్తూ ఉంటాడు.
ఈ వేడుకలు ఇంతకుముందు హైదరాబాద్ లోనే జరిగేవి. ఈ వేడుకలకి సినీ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యేవారు. అయితే ఈసారి సురేష్ కొండేటి పలు భాషలు అంటే తెలుగు, తమిళ, కన్నడ భాషలకి కలిపి గోవాలో సంతోషం అవార్డ్స్ ప్లాన్ చెయ్యగా అక్కడ వేడుకలో రసాభాస జరిగి కన్నడ సెలబ్రిటీస్ టాలీవుడ్ పై, మెగా పీఆర్వో అంటూ సురేష్ కొండేటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మెగా పీఆర్వో అంటూ వార్తలు రావడంతో అల్లు అరవింద్ ఈ రోజు ఓ ఈవెంట్ లో సురేష్ కొండేటి పై సంచలనంగా మట్లాడారు.
ఆయన మాకు పీఆర్వో కాదు, మాకు కాదు, మా ఫ్యామిలీకి కాదు, మా పక్కన నిలబడి ఫోటో దిగితే మాకు పీఆర్వో అవ్వడు. మెగా పీఆర్వో అంటూ రాస్తున్నారు. అందుకే చెబుతున్నాను ఆ వ్యక్తితో మాకు సంబంధం లేదు. అతను వ్యక్తిగతంగా ఈవెంట్ నిర్వహించుకున్నాడు, అది అతని వ్యక్తిగతం. అందులో అతను ఫెయిల్ అయ్యాడు. దీనికి టాలీవుడ్ ఇండస్ట్రీని, మెగా ఫ్యామిలీని అనడం సరికాదు.. అంటూ అల్లు అరవింద్ సురేష్ కొండేటికి తమకి సంబంధం లేదు అని చెప్పేసారు.
అది జరిగాక సురేష్ కొండేటి ట్విట్టర్ వేదికగా..
అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్ , అది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను
నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి అంటూ ట్వీట్ చేసాడు.