కెజిఫ్, కెజిఫ్ 2 తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న యశ్ తన తదుపరి మూవీ గురించిన న్యూస్ ఎప్పుడు చెబుతాడా అని ఆయన అభిమానులే కాదు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎదురు చూడని రోజు లేదు. అటు ప్రశాంత్ నీల్ సలార్ ని రెడీ చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తున్న యశ్ తన తదుపరి మూవీ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా నచ్చడంతో అభినులు డిస్పాయింట్ అవుతున్నారు. కెజిఫ్ 3 వరకు యశ్ కొత్త ప్రాజెక్ట్ మొదలు కాదేమో అనుకుంటున్నారు. గత ఏడాదే #Yash19 పై క్లారిటీ వస్తుంది అనుకుంటే ఇప్పటికి #Yash19 పై ఓ క్లారిటీ ఇచ్చారు.
Mark your calendars for 8th December 2023, 9.55AM as the most awaited title announcement for Rocking star Yashs next #Yash19 అంటూ KVN ఫిలిమ్స్ తో కోలబ్రెట్ కాబోతుంది అంటూ వచ్చిన అప్ డేట్ తో యశ్ ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అంటే యశ్ బర్త్ డే రోజున #Yash19 పై పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నారు. KGF తర్వాత యశ్ నర్తన్ తో సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. మరి యశ్ 19 డైరెక్టర్ ఎవరో, అసలు ఈ సస్పెన్స్ ఏమిటో డిసెంబర్ 8 న వీడబోతుందన్నమాట.