పవన్ కళ్యాణ్ జనసేన తెలంగాణ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంతో ఎవరెలా ఉన్నా ముఖ్యంగా బ్లూ మీడియా పండగ చేసుకుంటుంది. జనసేన తెలంగాణాలో పరువు పోగొట్టుకుంది అంటూ పవన్ కళ్యాణ్ పై పదే పదే వార్తలు రాస్తుంది. అసలు BRS లాంటి పెద్ద పార్టీ ఎందుకు ఓడిపోయిందో అనేది పక్కనపెట్టి, కాంగ్రెస్ ఎలా గెలిచిందో అనేది కూడా పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 8 నియోజక వర్గాల్లో అభ్యర్థులు ఓడిపోవడం, ఎన్ని ఓట్లతో ఓడిపోయారో అనేది ఛానల్స్ లో చూపిస్తూ ఆనందంగా పండగ చేసుకుంటున్నారు.
అక్కడ ఏపీలో టీడీపీ తో పొత్తు పొత్తుపెట్టుకున్న జనసేనకు కాస్త ఏపీ ప్రజల్లోగ్రిప్ ఉండడంతో.. బ్లూ మీడియా దానిని తగ్గించే ప్రయత్నాల్లో భాగమే నిన్న తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ గురించి పదే పదే ప్రస్తావించింది. ఇక్కడ తెలంగాణాలో జనసేన పరాభవం, పవన్ కళ్యా ప్రతాపం ఇంతేనా, పవన్ కళ్యాణ్ పత్తా లేకుండా పోయాడు, పవన్ కళ్యాణ్ ప్రభావం ఏమి లేదు, పవన్ కళ్యాణ్ ని చితక్కొడుతున్న సోషల్ మీడియా.. అబ్బో ఇలాంటి కారు కూతలతో బ్లూ మీడియా చెయ్యని రచ్చ లేదు.
మరి ఏపీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి అంతో ఇంతో బ్లూ మీడియా భయపడే ఇలాంటి రాతలు రాసింది అంటూ జనసైనికులు కూడా బ్లూ మీడియాపై విరుచుకుపడుతున్నారు.