Advertisementt

బిగ్ బాస్ తెలుగు 7 పై ట్రోలింగ్

Sun 03rd Dec 2023 08:25 PM
bigg boss telugu 7  బిగ్ బాస్ తెలుగు 7 పై ట్రోలింగ్
Trolling on Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 పై ట్రోలింగ్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 7 పై ట్రోలింగ్ మాములుగా లేదు. స్టార్ మా సీరియల్ బ్యాచ్ ని కాపాడుతున్నారంటూ, శోభా శెట్టి ని ఎలిమినేట్ అవ్వకుండా హౌస్ లోనే ఉంచుతున్నారు. ఆడలేని, ఆటలేని అమర్ ని టాప్ 5 వరకు లాక్కొచ్చారు, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పకుండా హోస్ట్ డైరెక్ట్ గా అమర్ దీప్ కి కెప్టెన్ ఇవ్వడం, మరోపక్క రతికని కావాలనే హౌస్ లోకి రీ ఎంట్రీ ఇప్పించడం, ఇంకా శివాజీ తప్పులని కప్పిపుచ్చడం వంటి విషయాలతో బిగ్ బాస్ పై ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది.

ఇక ఈవారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గౌతమ్ ని శోభా శెట్టి ని హౌస్ లో ఉంచేందుకు ఎలిమినేట్ చేయడంపై నెటిజెన్స్ నుంచి వ్యతిరేఖత మొదలయ్యింది. లెక్క ప్రకారం ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కావాలి కానీ.. ఆమెను సేవ్ చేసి గౌతమ్ ను బలి చేశారు. దీనిపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బిగ్ బాస్ నీకు నచ్చిన వారిని ఎలిమినేట్ చేసుకోవడానికి ఎందుకు ఓటింగ్ పెట్టడం, ఓట్లు వెయ్యమనడం ఇంతిలా చీట్ చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

గౌతమ్ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ బిగ్ బాస్.. ఇలా చేయడం కరెక్ట్ కాదు.. అంటూ బిగ్ బాస్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్స్. ఇక ఈవారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడినట్లుగా నిన్న శనివారమే లీకులు వచ్చేసాయి. 

Trolling on Bigg Boss Telugu 7:

Netizens are trolling on Bigg Boss Telugu 7th season

Tags:   BIGG BOSS TELUGU 7
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ