నిన్నగాక మొన్న వదిలిన సలార్ ట్రైలర్ సగం పూర్తయ్యేవరకు దేవా గా ప్రభాస్ ఎంట్రీ కనిపించలేదు. అదికూడా సాదాసీదాగా సింపుల్ గా ప్రభాస్ కనిపించేసిరికి గూస్ బంప్స్ రావాల్సింది కాస్తా.. ప్రేక్షకులు నిరాశపడిపొడిపోయేలా ఉంది. ఇప్పుడు తాజాగా సలార్ మూవీ మొదలైన 40 నిమిషాల వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదు, ప్రీ ఇంటర్వెల్ సీన్ దగ్గర నుంచే ప్రభాస్ సలార్ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొదటి 40 నిమిషాల్లో ప్రభాస్-పృథ్వీ రాజ్ ల చిన్నప్పటి స్నేహం, వారు విడిపోయే సన్నివేశాలు ఉంటాయని, ఆ తర్వాత పృథ్వీ రాజ్ సుకుమారన్ ని రాజుని చేసేందుకు తండ్రి పడే కష్టం, ఆ తర్వాత స్నేహితుడు నిస్సహాయ స్థితిలో ఉండగా.. అంటే దాదాపు 40 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట.
మరి ట్రైలర్ చూస్తే అదే నిజమనిపిస్తుంది. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించేసరికి నిజమే అయ్యుంటుంది అంటున్నారు. చాలావరకు పృథ్వీ రాజ్ సుకుమారన్ సీన్స్ ఉంటాయని.. ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా వేరే ప్రపంచంలోకి తీసుకువెళుతుంది అంటున్నారు. అయితే ఈన్యూస్ లు చూసిన ప్రభాస్ ఫ్యాన్ కటౌట్ ఉన్నోడికి సినిమా మొత్తం స్క్రీన్ స్పేస్ అక్కర్లేదు, పది బలమైన సన్నివేశాలుంటే చాలు అంటూ సరిపెట్టుకుంటున్నారు.