కెరీర్ లో కొన్నాళ్లుగా నాగ చైతన్య సక్సెస్ కి దూరమయ్యాడు. అటు పర్సనల్ ప్రోబ్లెంస్, ఇటు కెరీర్ లో ఒడిడుకులు. అక్కినేని హీరోల వరస వైఫల్యాలతో అక్కినేని ఫాన్స్ డిస్పాయింట్ మోడ్ లో ఉన్నారు. నాగ చైతన్య కి థాంక్యూ బిగ్ డిసాస్టర్ కాగా.. ఆ తర్వాత వచ్చిన కస్టడీ కూడా అదే రేంజ్ లో డిసాస్టర్ అయ్యింది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం చందు మొండేటి తో కొత్త సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే థాంక్యూ సినిమా సమయంలోనే చైతు విక్రమ్ కే కుమార్ తో దూత వెబ్ సీరీస్ స్టార్ట్ చేసాడు.
అయితే థాంక్యూ డిసాస్టర్ అవడంతో చైతు-విక్రమ్ కుమార్ ల దూత ని అందరూ మరిచిపోయారు. థాంక్యూ అంత పెద్ద డిసాస్టర్ కావడంతో వారి కాంబోపై క్రేజ్ తగ్గిపోయింది. మరోపక్క కస్టడీ కూడా డిసాస్టర్ అవడంతో దూత విషయం పూర్తిగా మరిచిపోయారు. అసలు చైతు దూత ఎప్పుడు విడుదల కాబోతుంది అనే ఇంట్రెస్ట్ అటు ప్రేక్షకుల్లోనూ ఇటు మేకర్స్ లో కూడా కనిపించలేదు. ఇక చైతు కొత్త సినిమా మొదలు పెడుతున్న తరుణంలో సడన్ గా దూత సీరీస్ డేట్ లాక్ చెయ్యడం వరసగా ప్రమోషన్స్ మొదలు పెట్టడం చకచకా జరిగిపోయాయి.
అమెజాన్ ప్రైమ్ కోసం తెరకెక్కించిన దూత ట్రయిలర్ తోనే అంచనాలు క్రియేట్ చేసింది. డిసెంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ నుంచి ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చిన దూతకి పాజిటివ్ రివ్యూస్ తో పాటుగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడమే కాదు... విక్రమ్ కె కుమార్ కంటెంట్ కి, నాగ చైతన్య నటనకి అందరూ క్లాప్స్ కొడుతున్నారు. చైతు పెరఫార్మెన్స్ ని ప్రశంసించినవారే కానీ.. దూత సీరీస్ ని విమర్శించిన వారు లేరు.
అందుకే అనేది థియేటర్స్ లో నాగ చైతన్య వరస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న నాగ చైతన్యకి డిజిటల్ డెబ్యూ మాత్రం విపరీతమైన పేరుని తెచ్చిపెట్టింది. అక్కడ ఓడినా.. ఇక్కడ ఓటిటిలో చైతు గెలిచి చూపించాడు.