విజయ్ దేవరకొండ తనకి సక్సెస్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ తో గీత ఆర్ట్స్ ని కాదని దిల్ రాజు బ్యానర్ లో ఫ్యామిలీ స్టార్ మొదలు పెట్టడమే చకచకా షూటింగ్ కంప్లీట్ చేసేస్తున్నారు. విజయ్ దేవరకొండ చిన్నపాటి గ్యాప్ కూడా తీసుకోకుండా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈమధ్యన వచ్చిన టీజర్ కూడా అద్భుతంగా ఉండడంతో సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇక దిల్ రాజు సంక్రాంతి సెంటిమెంట్ తో ఫ్యామిలీ స్టార్ ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని చాలాసార్లు చెప్పుకొచ్చారు.
మహేష్ గుంటూరు కారం ఉన్నా నా సెంటిమెంట్ నాదే అన్నట్టుగా దిల్ రాజు ఉన్నారు. కానీ ఇప్పడు సంక్రాంతి బరి నుంచి ఫ్యామిలీ స్టార్ తప్పుకున్నట్లుగా ప్రకటించారు. 2024 మార్చ్ లో ఫ్యామిలీ స్టార్ విడుదల అంటూ దిల్ రాజు ఓ మీడియా మీట్ లో క్లారిటీ ఇచ్చారు. అయితే ఫ్యామిలీ స్టార్ షూటింగ్ ఓ కొలిక్కి రాకపోవడం వలనే సినిమాని పోస్ట్ పోన్ చేసారని అంటున్నారు. విదేశీ షూటింగ్ బ్యాలన్స్ ఉండడంతో పరశురామ్ సంక్రాంతి టార్గెట్ చేరుకోవడం కష్టమని చెప్పడంతో దిల్ రాజు చేసేది లేక ఫ్యామిలీ స్టార్ ని మార్చ్ కి పోస్ట్ పోన్ చేసినట్లుగా తెలుస్తుంది.