గేమ్ ఛేంజర్ అప్ డేట్ పై మెగా ఫాన్స్ లో ఉన్న కోపం అంతా ఇంతా కాదు. అసలు రిలీజ్ డేట్ ఇవ్వకుండా, షూటింగ్ ఎంత పూర్తయ్యిందో చెప్పకుండా శంకర్, దిల్ రాజు లు అభిమానుల మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ మెగా ఫాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇక దివాళికి గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ అంటూ హడావిడి చేసి చివరికి చేతులెత్తేశారు మేకర్స్. మళ్ళీ మళ్ళీ అభిమానులని మేకర్స్ మోసం చేసారు. ఇండియన్ 2 పై ఉన్న ప్రేమ శంకర్ కి గేమ్ ఛేంజర్ పై లేదు అంటూ వారు సోషల్ మీడియాలో రచ్చ చెయ్యని రోజు లేదు.
అయితే తాజాగా దిల్ రాజు యానిమల్ మూవీ సక్సెస్ మీట్ లో గేమ్ ఛేంజర్ పై చిన్నపాటి అప్ డేట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యింది, త్వరలోనే షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది అంటూ దిల్ రాజు ఇచ్చిన చిన్నపాటి అప్ డేట్ కె ఫాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభిస్తామని.. వీలయినంత త్వరగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని దిల్ రాజ్ చెప్పడంతో ఫాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
మరి ఇండియన్ 2 రిలీజ్ డేట్ కి, గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కి ఎలా లేదన్నా ఆరు నెలల గ్యాప్ ఉంటుంది అనే మాట వినిపిస్తోంది. ఇక గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ అవ్వొచ్చనే ఊహాగానాలు దిల్ రాజు అప్ డేట్ తర్వాత స్టార్ట్ అయ్యాయి.