బిగ్ బాస్ సీజన్ 7లో టైటిల్ ఫేవరేట్ కనబడి ఇప్పుడు ఇప్పుడు జోకర్ లా మారిపోయిన అమర్ దీప్ ని చూస్తే నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. అది యాటిట్యుడో తెలియదు, నటిస్తున్నాడో అర్ధం కాదు.. అమర్ దీప్ ని ద్వేషించే శివాజీనే చివరికి అమర్ కి దగ్గరయ్యాడు. అయితే గత మూడు వారాల్లో అమర్ దీప్ కెప్టెన్సీ అవ్వడానికి చాలా పాట్లు పడ్డాడు. టాస్క్ ఆడాడు, అడుక్కున్నాడు, అయినా పని జరగలేదు. ప్రియాంక తో పోటీ పడిన టాస్క్ లో రతిక, గౌతమ్ లు టార్గెట్ చెయ్యడంతో అమర్ దీప్ విరుచుకుపడుతూ వాళ్ళని అడుక్కున్నాడు. ఆ తర్వాత మరో టాస్క్ లో అర్జున్ తో పోటీపడినప్పుడు కూడా అమర్ దీప్ శివాజీని అడుక్కుంటూ తన వాల్యూ పోగొట్టుకున్నాడు.
ఆ టాస్క్ లో శివాజీ, శోభా శెట్టి టైమ్ కి డెసిషన్ తీసుకోకపోవడంతో అమర్ కి కెప్టెన్సీ చేజారింది. ఇక హౌస్ లో లాస్ట్ కెప్టెన్ అవ్వాలన్న ఆశ ఆశగానే మిగిలిపోయింది. అయితే ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ లో అమర్ కన్నా పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటిలు బాగా ఆడారు. అమర్ దీప్ కి శోభా శెట్టి, గౌతమ్ పాయింట్స్ ఇచ్చినా చివరికి అర్జున్ అంబటినే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచాడు. అయితే ప్రియాంక, శోభా శెట్టి అమర్ దీప్ ని చాలా సందర్భాల్లో కాపాడుతున్నారు. ఆడలేక, ఓడిపోయి అందరి మీద ఫైర్ అయ్యే అమర్ దీప్ కోసం ఆఖరికి ప్రియాంక కూడా మేనిప్యులేట్ చేస్తుంది.
అయితే ఈవారం అమర్ దీప్ శోభా శెట్టి, ప్రియాంక అదే గౌతమ్ పాయింట్స్ తో 1200 కాయిన్స్ గెలుచుకోవడంతో అభినందించిన నాగార్జున నీకు ఈ వీక్ కి కెప్టెన్సీ ఇస్తున్నా అనగానే అమర్ దీప్ షాకైపోయాడు. నోరు తెరిచాడు, కెప్టెన్ బ్యాడ్జ్ వస్తుందా అని అడిగాడు.. హా వస్తుంది అని నాగ్ అనగానే పట్టరాని సంతోషం అమర్ దీప్ మోహంలో కనిపించింది.
అయితే అమర్ దీప్ ని టాప్ 5 వరకు తీసుకెళ్లేందుకే నాగార్జున, బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని కెప్టెన్ ని చేసారు, లేదంటే అమర్ ఆట చూస్తే ఎవ్వరూ అతన్ని సమర్ధించారు, అడుక్కుంటూ టాస్క్ ల్లో గెలిచాడు తప్ప, కండ బలము లేదు, అలాగని బుద్ధిబలం లేదు అమర్ లో అంటూ నెటిజెన్స్ అమర్ కి చివరి కెప్టెన్సీ ఇవ్వడంపై రకాకలుగా కామెంట్స్ చేస్తున్నారు.