బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం ఎనిమిదిమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఏడుగురు నామినేషన్స్ లో ఉండగా.. టికెట్ టు ఫినాలే అస్త్ర గెలుచుకుని అర్జున్ అంబటి నేరుగా ఫైనల్స్ లో అడుగుపెట్టాడు. ఇక ఈవారం డేంజర్ జోన్ లో గౌతమ్, లేదంటే శోభా శెట్టి ఉండగా అందులో గౌతమ్ ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తుంది. అయితే ఈ హౌస్ లో చాణిక్యుడిగా గేమ్ ఆడే శివాజీ కొద్దివారాల క్రితం ఓ టాస్క్ లో చేతికి దెబ్బ తగిలించుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
శివాజీ చేతి నెప్పిని అడ్డుపెట్టుకుని తనపై నెగిటివిటి ఉన్నప్పుడల్లా నన్ను పంపించెయ్యండి బిగ్ బాస్ వెళ్ళిపోతాను అని ఊగిపోయే ఆయన అపుడప్పుడు చేతి నొప్పిని భరించలేకపోతున్నాను వెళ్ళిపోతాను అంటూ బిగ్ బాస్ నే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.. అంటూ హౌస్ మేట్స్ లోని కొంతమంది మాత్రమే కాదు, నెటిజెన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ఎక్కువసార్లు చెయ్యి నొప్పి ఆడలేకపోయానంటూ చెప్పే శివాజీని నాగార్జున కూడా ఓదార్చేవారు.
కానీ ఈరోజు ఎపిసోడ్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ ఎంత ఇంపార్టెంటో తెలుసు కదా ఎందుకు సరిగా ఆడలేదు అని శివాజీని, శోభా శెట్టిని అడిగారు నాగ్. దానికి బాబు గారు చెయ్యి నొప్పి, అందుకే బాగా ఆడలేదు అన్నాడు శివాజీ. కానీ నువ్వు ఆడింది కాళ్లతో కదా చేతులతో కాదు కదా అంటూ చెప్పేసరికి శివాజీ ఫేస్ మాడిపోయింది. ఇక తర్వాత ప్రియాంకని కూడా నాగార్జున ప్రశ్నించారు, పాయింట్స్ విషయంలో అమర్ దీప్ అలిగాడని ఇచ్చావా అన్నారు, టికెట్ టు ఫినాలే గెలిచిన అర్జున్ ని మెచ్చుకున్న ప్రోమో వైరల్ గా మారింది.