ఎక్కడో కొడుతోంది శీనా? ఏదో జరగబోతోంది. ఇది ప్రస్తుతం తెలంగాణలో సర్వత్రా నడుస్తున్న టాక్. లాస్ట్ మినిట్‌లో ఏదో జరిగిందనేది అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మరు క్షణం నుంచి ఏదో అలజడి. పోలింగ్ చివరి క్షణంలో గులాబీ బాస్ ఏదో చేశారని గుసగుసలు. అసలు ఏం జరుగుతోందో అర్థం కాక తెలిసిన వాళ్లకు.. ముఖ్యంగా జర్నలిస్టులకు ఫోన్ చేసి ఆరాలు తీస్తున్న పలు పార్టీల నేతలు.. కేడర్. ఇక కౌంటింగ్‌కు కొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో ఏదైనా జరగొచ్చని తెలుస్తోంది.
కొన్ని గంటలు అంతే.. !
తుంగతుర్తిలో అర్ధరాత్రి ఈవీఎంలను మార్చేందుకు గులాబీ నేతలు ప్లాన్ చేశారంటూ వీడియోలతో సహా వైరల్ అవుతున్నాయి. కారులో ఈవీఎంలు కనిపిస్తున్నాయి. ఓ జర్నలిస్ట్ దీనికి యత్నించారని టాక్. కారు అద్దాలను ధ్వంసం చేశారు. మొత్తానికి వీడియో అయితే రచ్చ లేపుతోంది. పోలింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఓట్లు పోలవుతున్న విషయం గులాబీ బాస్ దృష్టికి వెళ్లిందట. దీంతో లాస్ట్ మినిట్‌లో ఆయన తన ఇన్‌ఫ్లూయన్స్ అంతా ఉపయోగించి అధికారులందరినీ మేనేజ్ చేశారని ప్రచారం జరుగుతోంది. అసలు లాస్ట్ మినిట్‌లో ఇది చేయడం సాధ్యమేనా? నెక్ట్స్ అధికారం ఎవరిది అని తెలియడానికి.. కొన్ని గంటలు అంతే.. !
ఎన్నికల ఫలితం వెలువడనే లేదు..
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకే అధికారం కట్టబెట్టాయి. అంతా ఓకే కాంగ్రెస్‌కే పట్టం అనుకుంటున్న సమయంలో.. కేసీఆర్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ నెల 4వ తేదీన మంత్రులతో భేటీ కాబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా 4వ తేదీ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించనున్నట్టు ప్రకటించేశారు. ఎన్నికల ఫలితం వెలువడనే లేదు.. పైగా కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ చెబుతున్నాయి అయినా కూడా అంత ధైర్యంగా కేసీఆర్ ఎలా ఇవి చెబుతున్నారని జనాలు షాక్ అవుతున్నారు. మరోవైపు రాజకీయ వర్గాల్లోనూ దీనిపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం గెలవదనుకున్న పార్టీ గెలుస్తుందని అధినేత అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో ఉత్సాహం రెట్టిపైంది.