పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల హడావిడి ముగియడంతో ఆయన ఆంధ్రాకి వెళ్లిపోయారు. తెలంగాణాలో బీజేపీతో దోస్తీ కట్టి జనసేనని కూడా ఎన్నికల బరిలో నిలిపిన పవన్ కళ్యాణ్.. ఇక్కడ జనసేన ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఆయన ఇకపై ఆంధ్ర రాజకీయాలవైపు మళ్లారు. తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాక ఎగ్జిట్ పోల్స్ లో జనసేన ప్రభావం కనిపించలేదు. నిన్న శుక్రవారం ఆయన గన్నవరం నుంచి మంగళగిరి జనసేన ఆఫీస్ కి బయలుదేరి వెళ్లారు.
ఆ తర్వాత జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై, టీడీపీ పొత్తుపై సంచలన కామెంట్స్ చేసారు. ఆతర్వాత ఆయన తనని విమర్శించేవారిపై సెటైర్ కూడా వేశారు. తాను సినిమాలు చేసుకుంటున్నప్పుడు తన కోసం, తన అప్పాయింట్మెంట్ కోసం వెయిట్ చేసిన వారే ఇప్పుడు తనని విమర్శిస్తున్నారన్నారు. మనం టీడీపీ వెనుక నడవడం లేదు, కలిసి నడుస్తున్నాం, జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం. ఏపీ భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తాను. పొత్తు ధర్మం పాటించి, ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం. త్వరలోనే నియోజకవర్గ నాయకులు, ఇంఛార్జులతో సమావేశాలు అంటూ కార్యకర్తలని మోటివేట్ చేసారు.
మనదే రాబోయే ప్రభుత్వం. ఎన్నికలకు 100 రోజులే సమయం ఉంది. కలసి పని చేద్దాం.. ప్రభుత్వంలో భాగస్వాములవుదాం. జగనన్న అన్ని వర్గాలను దోచుకుంటున్నాడు. రైతులను దగా చేశాడు.. కేవలం 16 మంది రైతులకే పంట నష్టం బీమా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఏపీకి అర్హత లేకుండాపోయింది అంటూ పవన్ సెన్సేషనల్ గా మట్లాడారు.