తెలంగాణ ఎన్నికల వేళ జగన్ దుశ్చర్య..!
నిన్న తెలంగాణలో రెండు మేజర్ సంఘటనలు జరిగాయి. ఒకటి పోలింగ్.. రెండు నాగార్జునసాగర్. అయితే పోలింగ్ మాటున నాగార్జున సాగర్ ఇష్యూ మరుగున పడిపోయింది. మేజర్ ఘటన అయినప్పటికీ పెద్దగా ఫోకస్ అవలేదు. అసలేం జరిగిందంటే.. తెలంగాణ పోలింగ్‌కు కొద్ది గంటల ముందు సాగర్ డ్యామ్ వద్ద అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. డ్యామ్‌పైకి ఏపీ పోలీసులు, అధికారులు వెళ్లడమే కాకుండా.. ఎస్పీఎఫ్ సిబ్బందిని కొట్టి.. గేట్లు తెరిచి దౌర్జన్యంగా లోపలికి ప్రవేశించి 13వ గేటు ఏపీదేనంటూ కంచె ఏర్పాటు చేశారు. కుడి కాల్వ గేట్లు ఎత్తకుండా విద్యుత్ నిలిపివేశారు.
ఎస్పీఎఫ్ సిబ్బంది సెల్‌ఫోన్లు లాక్కొని..
తెలంగాణలో పోలింగ్‌కు సరిగ్గా కొద్ది గంటల సమయం ముందు ఏపీ పోలీసులు, అధికారులు సాగర్ డ్యాంపైకి దౌర్జన్యంగా చేరుకున్నారు. అర్ధరాత్రి సుమారు 1500 మంది ఏపీ పోలీసులు చేరుకుని.. జలాశయం ప్రధాన ద్వారం తెరవాలంటూ ఎస్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వారు తీయకపోయే సరికి వాళ్లే దౌర్జన్యంగా గేట్లను తెరిచారు. అడ్డుకోబోయిన్ ఎస్పీఎఫ్ సిబ్బంది సెల్‌ఫోన్లు లాక్కొని.. నానా బీభత్సం సృష్టించారు. ఎస్పీఎఫ్ సిబ్బందితో గొడవపడి.. వారిపై చేయి కూడా చేసుకున్నారని సమాచారం. నీటి పారుదల శాఖ అధికారులు కుడికాల్వకు సంబంధించిన గేట్లు ఎత్తివేయడానికి యత్నించారు. కానీ అది జరగకుండా అడ్డుకునేందుకు తెలంగాణ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఉభయ రాష్ట్రాల పాలకులు కుమ్మక్కై ఇలా చేశారా?
అయినా నీటి విడుదల అయితే ఆగలేదు. విద్యుత్ సరఫరాను నిలిపివేసినా కూడా ఏపీ అధికారులు తమ పరిధిలోని కుడి కాల్వ పవర్ హౌస్ నుంచి విద్యుత్ సరఫరా చేసుకుని 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ హంగామా అంతా తెలంగాణ ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదు. తెల్లవారితే పోలింగ్.. దీనిపైనే తప్ప వేరే విషయంపై తెలంగాణ ప్రజానీకం ఆలోచించలేదు. ప్రజల దృష్టి దీని మీదకు వెళ్లదని గమనించే.. ఉభయ రాష్ట్రాల పాలకులు కుమ్మక్కై ఇలా చేశారని రైతు సంఘం అభిప్రాయ పడింది. విషయం తెలుసుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం నివ్వెరబోతోంది. కనీసం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిబంధనలను సైతం ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికీ నాగార్జున సాగర్ వద్ద హైటెన్షన్ కొనసాగుతోంది.