సలార్ ట్రైలర్ వదులుతామన్న రెండు రోజుల ముందే ప్యాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ సినిమా స్టోరీ లైన్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసారు. ఇద్దరి స్నేహితుల ప్రయాణమే సలార్ అంటూ అసలు గుట్టు విప్పెసారు. నిజమే సలార్ సినిమా కథ ఇద్దరి స్నేహితుల ప్రయాణం.. స్నేహం కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా అంటూ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ తో సలార్ ట్రైలర్ కొద్ది క్షణాల ముందే ప్యాన్ ఇండియాలోని పలు భాషలు ఆడియన్స్ ముందుకు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా నేరుగా వచ్చేసింది. సలార్ ట్రైలర్ డే అంటూ అభిమానుల రచ్చతో సోషల్ మీడియా హీటెక్కిపోయింది.
సలార్ ట్రైలర్ లోకి వెళితే చిన్నప్పుడే స్నేహానికి ప్రాణమిచ్చే దేవా(ప్రభాస్).. కాస్త వెనక్కి తగ్గి కనిపించే పృథ్వీ రాజ్. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం, నువ్వెప్పుడూ పిలిచినా నేనిక్కడి వస్తా.. అంటూ స్నేహితుడికి మాటిచ్చే దేవా ధైర్యం.. చిన్నప్పుడే విడిపోయిన స్నేహం. కుర్చీ కోసం పెద్ద సైన్యాన్నిఎదుర్కునే స్నేహితుడి కోసం రాక. తనకి ఎలాంటి సైన్యం అక్కర్లేదు దేవా ఉంటే చాలని చెప్పే స్నేహితుడికి అడుగడునా అండగా నిలిచే ప్రాణ స్నేహితుడు కథే సలార్ అని ట్రైలర్ లోనే రివీల్ చేసేసారు.
నా కళ్ళ ముందు ఉన్నదంతా నాకు కావాలంటూ స్నేహితుడు అడగడం.. దాని కోసం దేవా విలన్స్ ని మట్టుబెడుతూ రిక్వెస్ట్ చెయ్యడం అంతా ఇంట్రెస్టిగ్ పైగా అనిపించింది. కాకపోతే KGF లో బంగారు గని కోసం కొట్లాట. ఇక్కడ కుర్చీ కోసం పోట్లాట అనేలా ఉంది. సేమ్ టు సేమ్ లొకేషన్స్ అనేలా బొగ్గు గనులు. ఇక అన్నిటిలో హైలెట్ ప్రభాస్ పవర్ ఫుల్ దేవా లుక్, పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్, మధ్యలో హీరోయిన్ శృతి హాసన్ షాట్ అన్ని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అనేలా ఉన్నాయి.
ముందు నుంచి ఈ సినిమాకు ఉన్న హైప్ ను రెట్టింపు చేస్తూ ఈ ట్రైలర్ ఉంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. కేజీఎఫ్ ను మించి యాక్షన్ సీన్స్ తో ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.