40 ప్లస్ ఏజ్ లోను బిజీ తారగా యంగ్ హీరోయిన్స్ కి ఛాలెంజ్ విసురుతున్న త్రిష ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోలతో జత కడుతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమా త్రిషని మరోసారి బిజీ అయ్యేలా చేసింది, ముఖ్యంగా ప్రమోషన్స్ లో త్రిష లుక్స్ కి నెటిజెన్స్ మాత్రమే కాకుండా.. దర్శకనిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. అందుకే ఆమెకి వరసగా అవకాశాలు ఇస్తున్నారు. కమల్ హాసన్, అజిత్ ఇలా వరసగా స్టార్ హీరోలతోనే జోడి కడుతుంది.
అయితే త్రిష మోడ్రెన్ డ్రెస్సుల కన్నా ఈమధ్యన సారీ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. డిజైనర్ శారీస్, పట్టు చీరలు ఇలా ఏది వదలకుండా త్రిష శారీస్ చుట్టేస్తోంది. అందుకు తగిన హెయిర్ స్టయిల్ తో పదహారణాల తెలుగమ్మాయిలా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ లుక్స్ తో అందరి చూపు తనవైపే ఉండేలా చూసుకుంటుంది. అందరూ గ్లామర్ తో పడేస్తే త్రిష మాత్రం క్యూట్ గా శారీ లుక్స్ తో పడేస్తుంది.
రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రిష శారీ లుక్ ని షేర్ చేసింది. ట్రాన్స్పరెంట్ లైట్ కలర్ శారీ లో మెడలో పచ్చల హారంతో త్రిష చాలా అందంగా కనిపించింది. త్రిష లేటెస్ట్ శారీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు చూసి తరించండి.