Advertisementt

అపార్ధాలపై రిషబ్ శెట్టి క్లారిటీ

Fri 01st Dec 2023 05:18 PM
rishab shetty  అపార్ధాలపై రిషబ్ శెట్టి క్లారిటీ
Rishab Shetty reacted to the iffi press conference controversy అపార్ధాలపై రిషబ్ శెట్టి క్లారిటీ
Advertisement
Ads by CJ

రీసెంట్ గా ఓ అవార్డు ఫంక్షన్ లో కాంతార హీరో రిషబ్ శెట్టి.. తనకి ఎంత ఎలాంటి సక్సెస్ వచ్చినా తాను కన్నడ ఇండస్ట్రీని వదిలిపోను, కాంతార సినిమా ముందు కన్నడ లో హిట్ అయ్యాకే మిగతా భాషల్లో హిట్ అయ్యింది, నేను ఈ పరిశ్రమని వదిలి పోను అంటూ చేసిన వ్యాఖ్యలు రష్మిక మందన్నని ఉద్దేశించే చేసినవే. గతంలో వీరి మధ్యన నడిచిన కోల్డ్ వార్ తోనే రిషబ్ శెట్టి.. రష్మిక సక్సెస్ రాగానే ఇతర భాషలకి వెళ్ళిపోయింది అన్న టైప్ లోనే ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు అంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ లు గుప్పుమన్నాయి.

అయితే తాజాగా రిషబ్ శెట్టి తనపై వస్తున్న అపార్ధాలపై ఇండైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చాడు. ఈ గాసిప్స్ పై రిషబ్ శెట్టి అభిమాని ఒకరు సోషల్ మీడియాలో ఇలా ట్వీట్ చేసాడు. రిషబ్ చెప్పింది ఎవరిని ఉద్దేశించి కాదు, ఆయన ఇండస్ట్రీని వదిలి వెళ్ళనని చెప్పాడు అంటూ అప్పుడు రిషబ్ మాట్లాడిన స్పీచ్ ని పోస్ట్ చేసాడు. ఆ అభిమాని పోస్ట్ ని రీ ట్వీట్ చేస్తూ రిషబ్ శెట్టి నేను చెప్పింది ఇప్పటికైనా అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం కాంతారా హీరో రిషబ్ శెట్టి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Rishab Shetty reacted to the iffi press conference controversy:

Rishab Shetty yet again denies taking a dig at Rashmika

Tags:   RISHAB SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ