బిగ్ బాస్ సీజన్ 7 13 వ వారంలో టికెట్ ఫినాలే టాస్క్ జరుగుతుంది. గత సోమవారం నామినేషన్స్ పర్వం ముగియగానే హౌస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ మొదలైంది. ఇందులో ఎవరు గెలుస్తారో వారు డైరెక్ట్ గా ఫైనల్స్ కి వెళ్ళిపోతారు. ఆ టాస్క్ లో ముందుగా శోభా శెట్టి, శివాజీ ఎలిమినేట్ అయ్యారు. వారి పాయింట్స్ లో సగం అమర్ దీప్ కి ఇచ్చేసారు. ఆ తర్వాత యావర్, ప్రియాంక అవుట్ అవ్వగా.. అక్కడ ప్రియాంక తన పాయింట్స్ ని గౌతమ్ కి ఇచ్చింది. యావర్ మాత్రం ప్రశాంత్ కి ఇచ్చాడు. అయితే ప్రియాంక తన పాయింట్స్ ని తనకి కెప్టెన్సీలో హెల్ప్ చేసిన గౌతమ్ కి ఇవ్వడంపై ఆమె ఫ్రెండ్ అమర్ దీప్ చాలా బాధపడిపోయి ప్రియాంక ని టార్గెట్ చేసాడు.
ఇక తర్వాత టాస్క్ లో గౌతమ్ కూడా ఎలిమినేట్ అవడంతో అతని పాయింట్స్ లో సగమెవరికో ఒకరికి ఇవ్వమనగానే నేను నా పాయింట్స్ నీకిచ్చా ఇప్పుడు నీ పాయింట్స్ అమర్ కి ఇవ్వు అంది ప్రియాంక. దానితో గౌతమ్ ప్రియాంక పాయింట్స్ ని నేను అమర్ కి ఇస్తున్నా అనగానే శివాజీ బ్యాచ్ అర్జున్ అంబటిని ర్యాగింగ్ చేసారు. అమర్ కి 1000 పాయింట్స్ రావడంతో అమర్ హ్యాపీ, దానితో పల్లవి ప్రశాంత్ అమర్ అన్న మొహం వెలిగిపోతుంది అన్నాడు.
అయితే గౌతమ్ ప్రియాంక పాయింట్స్ ఇస్తున్నా తనని ఇకపై ఏమి అనకు అంటూ అమర్ కి వార్నింగ్ ఇచ్చినంత పని చెయ్యగానే.. నీకు ఇష్టమైతే ఇవ్వు అంతేకాని ప్రియాంకని ఏమనకు అంటూ ఇవ్వడం కరెక్ట్ కాదు అంటూ శోభా శెట్టి గౌతమ్ పై విరుచుకుపడింది. ఇక పాయింట్స్ పట్టికలో అమర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. పల్లవి ప్రశాంత్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక అర్జున్ మూడో ప్లేస్ లో ఎవ్వరి సహకారం లేకుండా కొనసాగుతున్నాడు.