పవన్ కళ్యాణ్ పరువు పోగొట్టుకున్నారా అంటే అవును నిజమే.. ఆయన పరువు పోయింది అనే అంటున్నారు. ఎందుకంటే అసలు జనసేన పార్టీ అంటే ఏమిటో కూడా తెలియని తెలంగాణలో జనసేన ఈ ఎలక్షన్స్ లో పోటీ చెయ్యడం ఎందుకో ఎవ్వరికి అర్ధం కాలేదు. అసలు బీజేపీకే తికాణా లేదు అందులో జనసేన చేరడమే వింత. ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ vs BRS అన్న రేంజ్ లో ఫైట్ ఉంది తప్ప మిగతా పార్టీలు ప్రభావం చూపలేకపోయాయి. పవన్ కళ్యాణ్ అనవసరంగా మధ్యలో వేలు పెట్టి ఈ ఎలక్షన్స్ లో పోటీ చేసారు.
ఇక నిన్న తెలంగాణాలో జరిగిన ఎలక్షన్స్ లో సాయంత్రానికి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. BRS తర్వాత ప్లేస్ లో ఉండగా.. బీజేపీకి MIM కి అరకొర సీట్స్ తప్ప అసలు జనసేన పార్టీ సోదిలోకి కూడా లేకుండా పోయింది. ఎక్కడా జనసేన పార్టీ ముచ్చటా లేదు, దాని ప్రభావమూ లేదు. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన కేండేట్స్ కి డిపాజిట్స్ కూడా దక్కవనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.
అనవసరంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎలక్షన్స్ లో పోటీ చేసి పరువు పోగొట్టుకోవడమే కాదు, అటు ఆంధ్రప్రజల్లోనూ చులకనైపోయాడు.