రేపు శుక్రవారం నైట్ ఈపాటికి ప్రభాస్ సలార్ ట్రైలర్ తో సోషల్ మీడియా షేకైపోవడం ఖాయం. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కలయికలో క్రేజీ ప్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న సలార్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలుసు, గత రెండు రోజులుగా సలార్ మ్యానియా సోషల్ మీడియాని కమ్మేసింది. అయితే సలార్ ట్రైలర్ ని ఏ ముంబై లోనో, లేదంటే ఏ బెంగుళూరులోనో, లేదంటే ఏ హైరాబాద్ లోనో గ్రాండ్ గా ఓ ఈవెంట్ లా సెలెబ్రేట్ చేస్తూ ప్రభాస్, ప్రశాంత్ నీల్ లు విడుదల చేస్తారని, సినిమాపై మరింత క్రేజ్, హైప్ క్రియేట్ చేస్తారని ప్రభాస్ ఫాన్స్ భావించారు.
కానీ సలార్ మేకర్స్ సలార్ ట్రైలర్ ని ఎలాంటి చప్పుడు చెయ్యకుండా అంటే ఎలాంటి ఈవెంట్ ప్లాన్ చెయ్యకుండా కామ్ గా విడుదల చేస్తున్నారని తెలుస్తోంది. అదే ఏదైనా ఈవెంట్ ప్లాన్ చేస్తే ఈపాటికే ఆ న్యూస్ స్ప్రెడ్ అయ్యేది. సలార్ ఎన్ని భాషల్లో విడుదల కాబోతుందో అన్ని భాషల యూట్యూబ్ ఛానల్స్ నుంచి సలార్ ట్రైలర్ అభిమానుల ముందుకు రాబోతుంది. మరి సలార్ ట్రైలర్ ఈవెంట్స్ తోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని భావించారు.
కానీ సైలెంట్ గా సలార్ ట్రైలర్ విడుదల చేసేసి అప్పుడు ట్రైలర్ రెస్పాన్స్ ని బట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. డిసెంబర్ 1 న ట్రైలర్ వస్తే.. డిసెంబర్ 11 నుంచి ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లలో ఓ ప్రెస్ మీట్ చొప్పున సలార్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ట్రైలర్ కట్ చాలా అద్భుతంగా వచ్చిందని, ఒక్కసారిగా బజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని వర్క్ చేస్తున్న వాళ్ళ నుంచి వినిపిస్తున్న కామెంట్.