Advertisementt

హాయ్ నాన్న నిర్వాహకులపై విజయ్ ఫాన్స్ ఫైర్

Thu 30th Nov 2023 01:45 PM
vijay deverakonda  హాయ్ నాన్న నిర్వాహకులపై విజయ్ ఫాన్స్ ఫైర్
Vijay fans fire on Nani Hi Nanna movie team హాయ్ నాన్న నిర్వాహకులపై విజయ్ ఫాన్స్ ఫైర్
Advertisement
Ads by CJ

నాని-మృణాల్ ఠాకూర్ జంటగా తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ వచ్చే గురువారం విడుదలకాబోతుంది. నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ ని క్రేజీగా మొదలు పెట్టి ఫినిష్ చేస్తున్నాడు. గత రెండు నెలలుగా నాని మీడియా ముందే కనబడుతున్నాడు. ప్యాన్ ఇండియా మార్కెట్ లో హాయ్ నాన్నపై క్రేజ్ తెచ్చెందుకు ఎంతో కష్టపడుతున్నాడు. అందులో భాగంగానే గత రాత్రి వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో అభిమానులతో పాటుగా చిత్రం బృందం సందడి చేసింది. 

అయితే హాయ్ నాన్న ఈవెంట్ లో నిర్వాహకుల అత్యుత్సాహం ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫాన్స్ కి కోపం తెప్పించింది. యాంకర్ సుమ స్టేజ్ పై స్క్రీన్ మీద కొందరు సెలబ్రిటీ జంటల ఫోటోలు చూపిస్తూ హాయ్ నాన్న టీమ్ ని ప్రశ్నలు అడిగే గేమ్ లో భాగంగా స్క్రీన్ మీద విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు సేదతీరుతున్న పిక్ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. విజయ్, రష్మికలు గోవాలో వేర్వేరుగా ఒకే లొకేషన్ లో తీసుకున్న ఫోటోలను పక్కపక్కన పెట్టేసి దానిమీద ప్రశ్న రేజ్ చెయ్యడం విజయ్ దేవరకొండ ఫాన్స్ కి నచ్చలేదు. 

అసలు స్క్రీన్ పై ఇది ఉన్నట్టుండి కనిపించేసరికి నానికి కూడా ఏమనాలో అర్థం కాక చిన్నగా నవ్వేయ్యగా, మృణాల్ ఠాకూర్ వాటీజ్ దిస్ అంటూ షాకైంది. దానితో యాంకర్ సుమ ఏదో కవర్ చెయ్యడానికి కెమెరామెన్, ఎడిటర్ మీద జోకు వేస్తూ టాపిక్ డైవర్ట్ చెయ్యబోయింది. కానీ అప్పటికే అది మిస్ ఫైర్ అవడంతో విజయ్ దేవరకొండ ఫాన్స్ కి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. వారు హాయ్ నాన్న నిర్వాహకులపై ఫైర్ అవుతున్నారు. మీ ఈవెంట్ మీరు చేసుకోండి మధ్యలో మా హీరోని లాగొద్దు అంటూ వారు హాయ్ నాన్న నిర్వాహకులపై, చిత్రం బృందం పై మండిపడుతున్నారు. 

Vijay fans fire on Nani Hi Nanna movie team:

Vijay Deverakonda fans fire on Nani Hi Nanna movie team

Tags:   VIJAY DEVERAKONDA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ