టాలీవుడ్ ప్రేక్షకులకి ఇలియానా పేరుని కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. సన్నజాజి నడుముతో టాలీవుడ్ ని షేక్ చేసి టాప్ చైర్ లో కొనసాగిన ఇలియానా బాలీవుడ్ పై ఉన్న ప్రేమతో సౌత్ ని పక్కనబెట్టేసింది. అక్కడ బాలీవుడ్ లో మంచి సినిమాలు చేసినా ఆమెకి బ్రేక్ ఇచ్చే సినిమా తగలకపోవడంతో.. ప్రేమలో పడింది. ఆ ప్రేమ బ్రేకప్ అవడంతో ఇలియానా కొన్నాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోయింది. సినిమాలకి దూరమైంది. తర్వాత మళ్ళీ ఈ గోవా బ్యూటీ తన పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యే నిర్ణయం తీసుకుని ఒక మగ బిడ్డకి తల్లయ్యింది.
ప్రెగ్నెన్సీ సమయంలో భర్తని పరిచయం చెయ్యకుండా కొడుకు పుట్టాక ఇన్నాళ్లకి ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. అయితే ఈ మధ్యన ఇలియానా మళ్ళీ రవితేజ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ నడుస్తున్న సమయంలో ఇలియానా పూర్తిగా సినిమాలకి, నటనకి గుడ్ బై చెప్పెయ్యబోతుంది అనే న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇలియానా కొడుకు, భర్త తో హ్యాపీ గా లైఫ్ ని లీడ్ చెయ్యాలనే నిర్ణయానికి వచ్చింది. అందుకే ఆమె నటనకు దూరం కాబోతుంది అంటున్నారు.
భర్త కొడుకుతో కలిసి ఇలియానా అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది అనే టాక్ మొదలయ్యింది. మరి నిజంగానే ఈ గోవా బ్యూటీ ఇండియా వదిలి వెళ్లిపోతుందా? ముఖ్యంగా నటనని పక్కనబెట్టేస్తుందా అనేది ఇప్పుడు ఆమె అభిమానుల్లో మొలకెత్తిన ప్రశ్నలు, ఆందోళన కలిగిస్తున్న ప్రశ్నలు.