గత పది రోజులుగా సోషల్ మీడియా మొత్తం యానిమల్ హవా నడుస్తుంది. ఎక్కడా చూసినా యానిమల్ ప్రమోషన్స్ తో టీమ్ ప్రేక్షకులని పడేస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక వీళ్ళంతా ప్రమోషన్స్ లో హడావిడి చేస్తున్నారు. అయితే సలార్ ట్రైలర్ వచ్చేవరకు ఒక లెక్క, ట్రైలర్ వచ్చాక ఓ లెక్క అన్నట్టుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న యానిమల్ పై ప్యాన్ ఇండియాలోని పలు భాషల్లో భీభత్సమైన క్రేజ్ ఉంది. అయితే గత రెండు రోజులుగా యానిమల్ హవా తగ్గిపోయి సలార్ హవా మొదలయ్యింది.
రేపు అంటే డిసెంబర్ 1 సాయంత్రం 7.19 నిమిషాలకు రాబోతున్న సలార్ ట్రైలర్ ని ట్రెండ్ చేస్తూ ప్రభాస్ అభిమానులు హడావిడి మొదలు పెట్టారు. #Animal హాష్ టాగ్ కనిపించకుండా #SalaarTrailer హాష్ టాగ్ ట్రెండ్ చేస్తూ హంగామా కాదు రచ్చ చేస్తున్నారు. దానితో ఇప్పటివరకు విపరీతమైన క్రేజ్ తో కనబడిన యానిమల్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించడం లేదు. రేపు యానిమల్ మూవీ విడుదల కాబోతుంది. అదే రోజు సాయంత్రానికి సలార్ టైలర్ రాబోతుంది.
కొంతమంది యానిమల్ క్రేజ్ ముందు సలార్ నిలబడదేమో అన్నారు, అనుకున్నారు. కానీ సలార్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో సోషల్ మీడియాలో X ఓపెన్ చేస్తే కానీ తెలియదు. ప్రభాస్ ఫాన్స్ సలార్ రేంజ్ ఏమిటో చూపిస్తున్నారు.