యాంకర్ శ్రీముఖి పెళ్లి మేటర్ పై కొంతకాలంగా సస్పెన్స్ నడుస్తుంది. శ్రీముఖి తాను ప్రేమించిన వాడితో పెళ్లి పీటలెక్కబోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్నా.. శ్రీముఖి మాత్రం కెరీర్ లో పరుగులు పెడుతుంది తప్ప పెళ్లి గురించిన ఆలోచన చెయ్యడం లేదు. శ్రీముఖి పెళ్ళెప్పుడు చేసుకుంటుందో అంటూ ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. పెళ్లి విషయం అడిగితే ఆ ప్రశ్నని చాలా చక్కగా దాటేసే శ్రీముఖ్ తాజాగా పెళ్లి పై, అలాగా లవ్ ఫెయిల్యూర్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తున్న శ్రీముఖికి పెళ్లప్పుడు, మీకు లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా అని అభిమానులు ప్రశ్నలు సంధించారు. వీటికి శ్రీముఖి జెన్యూన్ గా సమాధానమిచ్చింది. అందులో భాగంగానే శ్రీముఖి ప్రేమలో బొచ్చెడుసార్లు ఫెయిల్ అయ్యాను అంటూ షాకింగ్ గా సమాధానమిచ్చింది. ఇక పెళ్లి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అని చెప్పిన శ్రీముఖి అదెప్పుడో మాత్రం చెప్పలేను అంది. ఇక పెళ్లయ్యాక కూడా యాంకరింగ్ చేస్తారా అని అడిగితే పెళ్ళయినా యాంకరింగ్ మాత్రం వదలను అని చెప్పింది.
శ్రీముఖి తన బ్రేకప్ స్టోరీని గతంలోనూ స్టార్ మాలో వచ్చే బిగ్ బాస్ లో కూడా చెప్పింది. అయితే ఆ బ్రేకప్ ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. బిగ్ బాస్ కి వెళ్లొచ్చాక శ్రీముఖి ప్రతి తెలుగు ఛానల్ లోను యాంకర్ గా పలు షోస్ తో బిజిగా వుంది. ప్రస్తుతం శ్రీముఖి 30 ప్లస్ లోకి ఎంటరయ్యింది. అందుకే ఆమె పెళ్లి పై అందరిలో అంత ఆత్రుత.