ఈరోజు నవంబర్ 30 తెలంగాణాలో ఎలక్షన్స్ డే. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. హైదరాబాద్ లో సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలెబ్రటీస్ తమ తమ ఓటు ని వినియోగించుకుని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీడియా కూడా సెలబ్రిటీస్ ఓటు వెయ్యడానికి వెళ్ళిన వీడియోస్ తో హడావిడి చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి స్వామి మాలలో ఆయన భార్య సురేఖ, చిన్న కూతురు శ్రీజలతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్బులో ఓటు వెయ్యడానికి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, ఆయన భార్య లక్ష్మి ప్రణతి, ఎన్టీఆర్ తల్లి ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వెయ్యడనికి వచ్చారు. రానా FNCC లో ఓటు వెయ్యడానికి వెళ్లారు. అల్లు అర్జున్ అయితే ఏకంగా గంటసేపు లైన్ లో నిలబడి మరీ ఓటు వేసి వెళ్లిన పిక్ ని షేర్ చేసారు. విక్టరీ వెంకటేష్ రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండలోని హైదరాబాద్ ప్రేసిడెన్సి డిగ్రీ అండ్ పిజి కాలేజ్ లో, పోలోంగ్ బూత్ సంఖ్య 35 లోని, తన ఓటు వెయ్యగా అక్కినేని నాగార్జున, అమల,నాగ చైతన్య లు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 45, గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ పోలింగ్ నెంబర్ 151 కేంద్రం వద్ద తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ బంజారా హిల్స్ లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. నితిన్, రాజమౌళి అండ్ రమా రాజమౌళి ఇలా సినీ ప్రముఖులు తాము ఓటు వేసాము.. మీరు కూడా బాధ్యతగా ఓటు వెయ్యండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.