Advertisementt

కృతి చేసిన తప్పే శ్రీలీల కూడా చేస్తుంది

Wed 29th Nov 2023 07:54 PM
sreeleela  కృతి చేసిన తప్పే శ్రీలీల కూడా చేస్తుంది
Will Sreeleela suffer the same fate as Krithi Shetty కృతి చేసిన తప్పే శ్రీలీల కూడా చేస్తుంది
Advertisement
Ads by CJ

ఉప్పెన సినిమా విడుదలకు ముందే కృతిశెట్టి వెంట యంగ్ హీరోలు పడ్డారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుముందే ముగ్గురు యంగ్ హీరోల ఆఫర్స్ ఇవ్వడంతో కృతి శెట్టి ఉక్కిరిబిక్కిరైంది. ఉప్పెన రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజులు కూడా హిట్ అవడంతో కృతి శెట్టి తనకి వచ్చిన సినిమాల్లో తన పాత్ర ఏమిటో, ఎలా ఉంటుందో అనేది అంచనా వెయ్యకుండా చక చకా సినిమాలకి సైన్ చేసింది. దానితో వరసగా ప్లాప్స్ పడ్డాయి. గోల్డెన్ లెగ్ హీరోయిన్ అన్న వారే ఇప్పుడు ఐరన్ లెగ్ అంటున్నారు. తనకొచ్చిన సక్సెస్ లు తన సినిమాల ఎంపికలో తికమకపడేలా చేసాయి కృతి శెట్టిని.

ఇప్పుడు అదే లెక్కలో మరో హీరోయిన్ కనిపిస్తుంది. ఆమె శ్రీలీల. శ్రీలీల పెళ్లిసందD తో వచ్చిన ఫేమ్ ని సరిగ్గా వాడుకోలేకపోతుందేమో అనిపిస్తుంది. ధమాకా హిట్ తర్వాత శ్రీలీల చేతిలోకి వరసగా ఏడెనిమిది అవకాశాలొచ్చాయి. వరస బెట్టి సినిమాలు సైన్ చేసింది. ఇప్పుడు నెలకో సినిమా విడుదల చేస్తుంది. అయితే శ్రీలీల కి ధమాకా తప్ప ఇప్పటివరకు మంచి సినిమా పడలేదు. భగవంత్ కేసరిలో శ్రీలీల మంచి కేరెక్టర్ చేసింది. ఆ సక్సెస్ లో సగభాగం బాలయ్యదే. ఇక స్కంద, ఆదికేశవ ఈ రెండు సినిమాల్లో శ్రీలీల పాత్ర పెద్దగా లేదు, ఆ సినిమాలు హిట్ అవ్వలేదు.

ఆ సినిమాల్లో శ్రీలీల కేవలం గ్లామర్ కి పాటలకే పరిమితమైంది, పాటల్లో తప్ప పెద్దగా కనిపించలేదనే విమర్శలు ప్రేక్షకుల నుంచి వ్యక్తమయ్యాయి. రేపు రాబోయే ఎక్సట్రార్డినరీలో శ్రీలీల కేరెక్టర్ ఎలా ఉండబోతుందో.. అసలు శ్రీలీల ఎందుకు ఇలాంటి సినిమాలు ఎంచుకుంటుంది. తన క్రేజ్ కి తగ్గట్టుగా తన పాత్ర ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ప్రాజెక్ట్ ఒప్పుకోవాలి, ఫేమ్ ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే అప్పట్లో కృతిశెట్టి చేసిన తప్పే ఇప్పుడు శ్రీలీల చేస్తుంది అనుకోవాలి. 

Will Sreeleela suffer the same fate as Krithi Shetty:

Warning Bells for Sreeleela - Don t become another Krithi Shetty

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ