Advertisementt

తారక్ వార్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

Wed 29th Nov 2023 04:10 PM
war 2,ntr,hrithik roshan  తారక్ వార్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
NTR-Hrithik War 2 release date locked తారక్ వార్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న వార్ 2 మూవీపై ఏ అప్ డేట్ వచ్చినా ఇక్కడ తెలుగు ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫాన్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అవుతున్నారు. హ్రితిక్ రోషన్ హీరోగా ఆయన్ ముఖర్జీ తెరకెక్కించబోయే వార్ 2 లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చెయ్యబోతున్నాడు, అతని పాత్ర కోసం ఎన్టీఆర్ కి మేకర్స్ 30 కోట్ల పారితోషకం ఫిక్స్ చేసారు.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోసం ముంబై భామని దించుతున్నారనే ప్రచారం జరుగుతుంది.

ఇక్కడ తెలుగులో దేవర ప్యాన్ ఇండియా ఫిల్మ్ షూట్ కంప్లీట్ చేసేసి అక్కడ వార్ 2 సెట్స్ లోకి ఎన్టీఆర్ వెళ్ళిపోతాడంటూ ఏవేవో ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ల వార్ 2 పై బిగ్గెస్ట్ అప్ డేట్ వచ్చేసింది. భారీ బడ్జెట్ తో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు తెరకెక్కించనున్న వార్ 2 ని 2025 ఆగష్టు 14 అంటే ఇండిపెండెన్స్ డే సందర్భముగా విడుదల చెయ్యబోతున్నట్టుగా ఇచ్చిన అప్ డేట్ తో సోషల్ మీడియాలో #JrNTR #War2 హహ్స్ టాగ్స్ ట్రేండింగ్ లోకి వచ్చేసాయి.

ఇక ఈచిత్ర షూటింగ్ లో తారక్ వచ్చే ఏడాది జనవరి నుంచి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం. దేవర షూటింగ్ పూర్తవ్వగానే ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లోకి వెళ్ళిపోతాడని తెలుస్తోంది. 

NTR-Hrithik War 2 release date locked:

War 2 Featuring NTR - Hrithik Roshan Locks Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ