ప్రస్తుతం ఇంటా బయటా అంటే టాలీవుడ్, బాలీవుడ్ ప్యాన్ ఇండియాలోని పలు భాషలు మొత్తం యానిమల్ మ్యానియా నడుస్తుంది. ఒక హిందీ సినిమాకి ఈ మాత్రం క్రేజ్ టాలీవుడ్ లో వచ్చింది అంటే హీరోయిన్ సౌత్ అమ్మాయి కావడం, సందీప్ రెడ్డి తెలుగు వాడు కావడంతో పాటుగా.. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి చిత్రానికి హైప్ క్రియేట్ చెయ్యడంలో ముఖ్య పాత్ర పోషించడం, యానిమల్ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చడంతో.. గత రెండుమూడు రోజులుగా సందీప్ రెడ్డి వంగా తెలుగు మీడియాలోనే కనబడుతున్నారు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ అంటూ హడావిడి చేస్తున్నారు.
రేపు శుక్రవారం విడుదల కాబోయే యానిమల్ గనక హిట్ టాక్ తెచ్చుకుంటే ఓ వారం పదిరోజుల పాటు యానిమల్ హవా కొనసాగడం ఖాయం. ముఖ్యంగా యానిమల్ క్రేజ్ ముందు టాలీవుడ్ యంగ్ హీరోలు రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. డిసెంబర్ 22 న డైనోసార్ ప్రభాస్ సలార్ తో వస్తుండడంతో ఎప్పుడో రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న నాని, నితిన్ లు ప్రభాస్ తో పోటీ పడడం కరెక్ట్ కాదని తమ సినిమాలని డిసెంబర్ మొదటి వారానికి ప్రీ పోన్ చేసుకున్నారు. అంటే డిసెంబర్ 1 యానిమల్ వస్తుంటే.. డిసెంబర్ 7 న హీరో అని హాయ్ నాన్న ని విడుదల చేస్తున్నాడు.
ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్స్ ముందు హాయ్ నాన్న, ఎక్స్ట్రా మూవీస్ ప్రమోషన్స్ హైలెట్ అవ్వడం లేదు. యానిమల్ విడుదలకి హాయ్ నాన్న కి కేవలం ఆరు రోజులే గ్యాప్. ఇక నితిన్ డిసెంబర్ 8 న ఎక్స్ట్రా రిలీజ్ చేస్తున్నాడు. మరి యానిమల్ కి పాజిటివ్ టాక్ పడితే రెండు వారాల పాటు యానిమల్ దున్నేస్తుంది. అప్పుడు నాని, నితిన్ కి ఓపెనింగ్స్ వచ్చినా తర్వాత కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. అదే డివైడ్ టాక్ వస్తే ఇక అంతే. మరి నాని, నితిన్ లు రిస్క్ చేసినట్లే కదా.. అక్కడ సలార్ నుంచి తప్పించుకుంటే ఇక్కడ యానిమల్ కి దొరికిపోయేలా ఉన్నారు.