రేపు జరగబోయే తెలంగాణ ఎలక్షన్స్ కి అన్ని ఏర్పాట్లని ఈసీ ముమ్మరంగా పూర్తి చేస్తుంది. ఎలెక్షన్ కమీషన్ ఈరోజు రేపు తెలంగాణ ఎన్నికల కారణంగా విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఇక రాజకీయ పార్టీలు తమ గొంతు అరిగిపోయేలా ప్రజల దగ్గరకు వెళ్లి తమకి ఓటెయ్యమని అడిగారు. ప్రచారాలు, సభలు, రోడ్ షోలు అబ్బో తెలంగాణ మొత్తం గత నెలరోజులుగా భీభత్సంగా మారిపోయింది. మరో వైపు తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కొన్ని వందల కోట్లు చేతులు మారడము, కొన్నిచోట్ల ఇలాంటి నల్లధనాన్ని సీజ్ చెయ్యడముకూడా చూసాం.
ఈ ఎన్నికల్లో తమకే ఓటు వేయాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బులు పంచే ఉంటారు. అయితే ఆ డబ్బులు పంపకం ఈసీకి తెలియకుండా చాలా రకాల కోడ్ భాషలు వాడుతూ రకరకాలుగా ప్లాన్స్ చేసి ఆ డబ్బుని ప్రజలకు చేరవేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆ డబ్బుల పంపకంలో ఓ విచిత్రమైన పద్దతి వెలుగులోకొచ్చింది. అదేమిటో మీరూ చూసెయ్యండి.
LB Nagar లో ఒక పార్టీ అభ్యర్ది ఓటర్ల కి డబ్బులు పంచే విధానం వింటే మతి పోతుంది...
ముందుగా మీ Phone కి ఒక Msg వస్తుంది..
మీ కాలనీ లో ఉండే పలానా కిరాణా షాప్ కి వెళ్ళి మేము మీకు Msg చేసిన సరుకు కట్టమని మీరు అడగాలి
ఉదా :- అరకిలో పంచదార , అరకిలో గోధుమపిండి
పావుకిలో బెల్లం,కిలో బియ్యం ,100గ్రా జీలకర్ర ఇలా
ఆ Msg షాప్ ఓనర్ కి చూపిస్తే ,అతను ఒక పొట్లం ఇస్తాడు..
ఇంటికి పోయి పొట్లం విప్పితే , మీ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉంటే అంతమంది డబ్బులు ఆ గోధుమపిండి లో దాక్కోని ఉంటాయ్
దీన్నే ఇంటింటికీ కేసీఆర్ కిరాణా పధకం అంటూ హర్షిస్తున్న LB Nagar వాసులు 😎