మలయాళ భామ మాళవిక మోహనన్ మాతృ భాషకన్నా ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. తమిళనాట వరసగా స్టార్ట్ హీరోలతో నటించింది. అయితే మాళవిక మోహనన్ కి అనుకున్న బ్రేక్ అయితే రాలేదు.. అందుకే మాళవిక ఎక్కువగా సోషల్ మీడియానే నమ్ముకుంటుంది. తరచూ మాళవిక మోహనన్ స్పెషల్ ఫోటో షూట్స్ తో హడవిడి చేస్తుంది. మోడరన్ డ్రెస్ అయినా, ట్రెడిషనల్ వేర్ అయినా అందాలు ఆరబొయ్యడంలో ఎక్కువగా శ్రద్ద పెడుతుంది.
ప్రస్తుతం ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతి డైరెక్షన్ లో మూవీ చేస్తున్న మాళవిక మోహనన్ తమిళనాట కూడా బిజీగానే కనబడుతుంది. ఇక రీసెంట్ గా దివాళి సెలెబ్రేషన్స్ లో పద్దతిగా సాంప్రదాయంగా కనిపించిన మాళవిక మోహనన్ మళ్ళీ శారీ లుక్ తో దిగిపోయింది. లైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో మాళవిక మోహనన్ క్యూట్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది. దానితో ఆమె అభిమానులు మాళవిక మోహనన్ హాష్ ట్యాగ్ ని ట్విట్టర్ X లో ట్రెండ్ చేస్తూ ఆ ఫొటోస్ ని వైరల్ చేసారు.