KGF 2 విడుదల కాకముందే ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ స్టార్ట్ చేసి అంచనాలు పెంచిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత ఫస్ట్ లుక్ తోనే సలార్ రేంజ్ ఏమిటో చూపించారు. ప్రభాస్ కోసం టాప్ మలయాళ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ ని విలన్ గా సెట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉండబోతుందో హింట్ ఇచ్చారు. సలార్ టీజర్ వదిలి సినిమాలో మాస్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో పరిచయం చేసారు. రిలీజ్ డేట్ విషయంలో నిరాశపరిచినా.. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డిసెంబర్ 22 న సలార్ ని దింపేందుకు రంగం సిద్ధం చేసేసారు. మరో రెండు రోజుల్లో సలార్ ట్రైలర్ రాబోతున్న తరుణంలో ప్రశాంత్ నీల్ సలార్ స్టోరీ లైన్ రివీల్ చేసి సర్ ప్రైజ్ చేసారు.
నిన్నటివరకు సలార్ పోస్ట్ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఓ ఇంగ్లీష్ డైలీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సలార్ స్టోరీ లైన్ ని రివీల్ చేసారు. అంతేకాదు సలార్ పై ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రైలర్ వచ్చే ముందు ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఈ సర్ ప్రైజ్ తో ప్రభాస్ ఫ్యాన్స్ అస్సలగడం లేదు. ఇంతకీ ప్రశాంత్ నీల్ చెప్పిన ఆ స్టోరీ ఏమిటంటే.. ఇద్దరు స్నేహితులు - శత్రువుల మధ్యన కథనే సలార్ అని, స్నేహం అనేది ఎమోషనల్ గా ఉంటుంది, మొదటి భాగంలో సగం కథ రివీల్ చేస్తున్నామని, ఓవరాల్ గా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చేసే జర్నీనే సలార్ లో చూపించబోతున్నాం.
డిసెంబర్ 1 న విడుదలయ్యే ట్రైలర్ తో సలార్ ప్రపంచాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నామని చెప్పిన ప్రశాంత్ నీల్.. సలార్ కి KGF కి ఎలాంటి పోలిక లేదని తేల్చేసారు. స్టోరీ మొదలైనదగ్గరనుంచి దేనికవే డిఫ్రెంట్ గా ఉంటాయని, సలార్ మొదటి భాగం విడుదలయ్యాక కొద్దిరోజుల గ్యాప్ తో రెండో భాగం షూటింగ్ మొదలు పెడతామని, కానీ సలార్ పార్ట్ 2 ఎప్పుడు విడుదల చేస్తామో అనేది తానిప్పుడే చెప్పలేమని ఈ డైరెక్టర్ చెప్పారు.