మొదలైపోయింది సలార్ హంగామా, స్టార్ట్ అయ్యిందరో.. సలార్ హడావిడి, డైనోసార్ వచ్చేస్తున్నాడు.. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఆకలి, ఆకలిమీదున్నారు, ఈ సమయాన్ని వదులుతారా అస్సలు వదలరు, ఆకలిమీదున్న సింహాన్ని వదిలితే అది ఎలా బిహేవ్ చేస్తుందో అలా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాపై పడ్డారు. సలార్ ట్రైలర్ కోసం ఎదురు చూసి చూసి ఉన్నారు, ఇప్పుడు సలార్ ట్రైలర్ వచ్చే సమయం దగ్గర పడింది. డిసెంబర్ 1 సాయంత్రం 7.15 నిమిషాలకి సలార్ ట్రైలర్ వస్తుంది అని మేకర్స్ చేసిన ట్వీట్ కన్నా ముందే ఫాన్స్ అలెర్ట్ అయ్యారు.
సలార్ ట్రైలర్ నిడివి ఇంత, సలార్ ట్రైలర్ లో ఏ సీన్ ఎలా ఉంటుందో.. ప్రభాస్ ఎలా కనిపిస్తాడో, ఎన్ని యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయో అంటూ మాట్లాడుకుంటున్నారు. సలార్ ట్రైలర్ కి సంబందించిన ట్వీట్స్ తో అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ చూసినా సలార్ సలార్ అంటూ ట్వీట్లే కనబడుతున్నాయి. ఒక్కసారి ట్రైలర్ వస్తే.. ఇక ఈ 20 డేస్ కూడా సలార్ మ్యానియానే సోషల్ మీడియాలో కనబడుతుంది. ఇక డిసెంబర్ 22 వరకు ప్రభాస్ సోషల్ మీడియాని ఆక్యుపై చేస్తారు.
ఇప్పుడున్న అంచనాలకు ఫాన్స్ డబుల్ చేసేలా కనిపిస్తున్నారు. ట్రైలర్ విడుదలయ్యాక దానికి రికార్డ్ వ్యూస్, లైక్స్ తో హోరెత్తించేలా ఏర్పాట్లని అభిమానులు మొదలెట్టేసారు. #Salaar, #SalaarTrailer, #PrashanthNeel, #Prabhas హాష్ టాగ్స్ తో సోషల్ మీడియా X హోరెత్తిపోతుంది.