ప్రస్తుతం ఇండియా మొత్తం యానిమల్ మ్యానియా నడుస్తుంది. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ ట్రైలర్ అలా అంది. ఎప్పుడెప్పుడు యానిమల్ చూసేద్దామా అనే ఆత్రుతలో మాస్ ఆడియన్స్ ఉన్నారు. రణబీర్ కపూర్, రష్మిక, సందీప్ రెడ్డి వంగా ముగ్గురూ గత పది రోజులుగా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారే కనబడుటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా యానిమల్ క్రేజ్ నడుస్తుంది. మరొక్క రెండు రోజుల్లో సలార్ మ్యానియా కూడా మొదలవుతుంది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ ట్రైలర్ పై ట్వీట్లు దంచి కొడుతున్నారు.
ఇప్పటినుంచి సలార్ ట్రైలర్ వచ్చేవరకు ప్రభాస్ ఫ్యాన్స్ వేసే ట్వీట్స్ సోషల్ మీడియాలో షేకైపోయేలా ఉంది. అసలే ప్రభాస్ ఫాన్స్ ఎప్పటినుంచో సలార్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక సలార్ ట్రైలర్ వచ్చాక.. సినిమా విడుదల కాబోయే ఈ 20 రోజులు ప్రభాస్, ప్రశాంత్ నీల్ లు ప్రేక్షకుల్లోనే ఉండబోతున్నారని తెలుస్తుంది. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 22 అంటే సినిమా విడుదలయ్యే వరకు ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
యానిమల్ రిలీజ్ అయ్యాక దాని హడావిడి చూసి అప్పుడే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారట. మరోపక్క సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు.. ఎంతవరకు ప్రశాంత్ నీల్ సలార్ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తాడో అనే ప్రచారం జరుగుతుంది. కానీ పక్కాగా ప్రభాస్ తో పాటుగా ప్రశాంత్ నీల్ కూడా సలార్ ఈవెంట్స్ లో కనిపిస్తాడని అంటున్నారు.