Advertisementt

BB7: శివాజీ ఓ నాగుపాము

Tue 28th Nov 2023 01:34 PM
ashwini,sivaji  BB7: శివాజీ ఓ నాగుపాము
BB7: Ashwini shocking comments on Sivaji BB7: శివాజీ ఓ నాగుపాము
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ హౌస్ లో చాణుక్యుడిగా అటు టాస్క్, ఇటు మైండ్ గేమ్ ఆడే శివాజీ అంటే కేవలం ప్రశాంత్, యావర్ కి తప్ప మిగతా వాళ్ళకి మండుతుంది. కొన్నిసార్లు శివాజీపై ఆ నెగిటివిటి బయటికి చూపించినా చాలామందికి శివాజీ కన్నింగ్ గేమ్ మాత్రం లోలోపల ఉడికిస్తుంది. హౌస్ నుంచి బయటికి వచ్చిన కంటెస్టెంట్స్ శివాజీపై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ హౌస్ లో సీరియల్ బ్యాచ్ ని టార్గెట్ చేస్తూ తన శిష్యులతో వాళ్ళని నామినేట్ కూడా చేయిస్తున్నాడంటూ చాలామంది మాట్లాడుకోవడమే కాదు.. నాగార్జున కూడా శివాజీ బ్యాచ్ కి స్పై బ్యాచ్ అనే పేరు పెట్టారు.

అయితే శివాజీ బిగ్ బాస్ హౌస్ లో నాగుపాము, ఆయన పగబట్టారంటే ఎవ్వరైనా హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సిందే అన్నట్టుగా ఈవారం ఎలిమినేట్ అయిన అశ్విని మాట్లాడడం అందరికి షాకిచ్చింది. తన మీద తనకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేషన్ చేసుకున్న అశ్విని హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక BB బుజ్ ఇంటర్వూస్, అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వూస్ ఇస్తుంది. అందులో భాగంగా ప్రియాంకని మళ్ళీ మళ్ళీ టార్గెట్ చేసి ఊసరవెల్లి అన్న అశ్విని శివాజీ పై చేసిన నాగుపాము కామెంట్స్ వైరల్ అయ్యాయి. తనని బ్రిక్స్ టాస్క్ లో తోసేశారు.

నాగుపాము అనే పెద్ద మాట అనను కానీ, ఆయన మెచ్యూరిటీ ఆట, ఆయన ప్లానింగ్ అన్నీ నాగుపాము కంటే ఎక్కువే అంటూ అశ్విని శివాజీ ఆటని, ఆయన కన్నింగ్ తెలివి తేటలని బయటపెట్టింది. ప్రస్తుతం ఇంటా, బయటా కూడా శివాజీపై నెగెటివిటి మొదలయ్యింది. అక్కడ అమర్ దీప్ విషయంలో, అర్జున్ విషయంలో ఆయన చేసిన పని వలన ఆయనపై నెటిజెన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత మొదలైంది. హౌస్ లోను చాలామంది హౌస్ మేట్స్ శివాజీని టార్గెట్ చేస్తున్నారు.

 

BB7: Ashwini shocking comments on Sivaji :

Bigg Boss 7: Ashwini on SIvaji game 

Tags:   ASHWINI, SIVAJI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ