కన్నడ కెరటం ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా మారి వరస సక్సెస్ లతో అందరిని మెస్మరైజ్ చేస్తున్న రష్మిక మందన్న ప్రస్తుతం యానిమల్ ప్రమోషన్స్ తో అందరి చూపు తనవైపు ఉండేలా, అందరూ తన గురించే మట్లాడుకునేలాంటి గ్లామర్ షో చేస్తూ బ్యూటిఫుల్ లుక్స్ తో పడేస్తుంది. గతంలో పుష్ప చిత్రంలో డీ గ్లామర్ రోల్ చేసిన రష్మిక ఆ చిత్ర ప్రమోషన్స్ లో గ్లామర్ గా మోడ్రెన్ డ్రెస్సులతో, శారీస్ తో స్పెషల్ గా కనిపించింది. ప్రతి భాషలోనూ పుష్ప ప్రమోషన్స్ కి రష్మిక గ్లామర్ షో చేస్తూనే వెళ్ళింది. అందులోనే అందాలు చూపించింది.
ఇప్పుడు అదేమాదిరి రష్మిక తాను నటించిన హిందీ మూవీ యానిమల్ ప్రమోషన్స్ లో కనబడుతుది. హిందీలో ప్రమోషన్స్ ఫినిష్ చేసి మిగతా భాషలపై పడిన యానిమల్ టీమ్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంది. నిన్న మీడియా తో ఇంటరేక్షన్ తర్వాత వెంటనే మల్లారెడ్డి యూనివర్సిటీలో మహేష్, రాజమౌళి గెస్ట్ లుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హడావిడి చేస్తుంది. ఇక యానిమల్ ప్రమోషన్స్ లో రష్మిక డీప్ నెక్ బ్లౌజ్ లతో.. ట్రెండీ శారీస్ తో అదరగొట్టేస్తుంది.
నిన్న హైదరాబాద్ రెండు యానిమల్ ఈవెంట్స్ లో రష్మిక రెండు రకాల కలర్స్ ఉన్న స్పెషల్ శారీ లుక్స్ తో అందరిని మెప్పించింది. ప్రత్యేకంగా రష్మిక తన సినిమా ప్రమోషన్స్ లో ఇలా గ్లామర్ డ్రెస్సులు తో పాటుగా ఎక్కువగా శారీస్ లోనే కనబడుతుంది. అది కూడా ఎక్కడా గ్లామర్ మిస్ అవ్వకుండా. రష్మిక-రణబీర్ కపూర్ కలయికలో సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ రేపు శుక్రవారమే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.