బిగ్ బాస్ సీజన్ 7 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో గ్లామర్ గా ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ 12 వ వారంలో సెల్ఫ్ నామినేషన్ లోకి వెళ్లి ఓవర్ కాన్ఫిడెంట్ తో ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాకా భోలేతో స్నేహం చేస్తూ శివాజీ గ్రూప్ కి దగ్గరైంది. అయితే టాస్క్ ల్లో స్ట్రాంగ్ గా కనిపించే అశ్విని ఫ్రెండ్ షిప్ విషయంలోనూ ఎదుటి వారితో మాట్లాడే విషయంలో చాలా వీక్, ఫ్లిప్ చేస్తూ మాటలు వదలడమే కాదు, విమెన్ కార్డ్ తీసి తనని తాను డిపెండ్ చేసుకోలేక ఆ తప్పుని ఇతరులపై నెట్టేసే రకం.
ముఖ్యంగా ప్రియాంక గేమ్, ఆమె మాట తీరుని అశ్విని అస్సలు భరించలేకపోయేది. దానితో ప్రియాంకని తరచూ బ్లేమ్ చేస్తూ ఇతర కంటెస్టెంట్స్ దగ్గర మాట్లాడేది. ప్రియాంకని నెగెటివ్ చేసేందుకు చాలా తాపత్రయపడింది. కానీ చివరికి అశ్వినిని నెటిజెన్స్ బయటికి పంపేశారు. ఇక ఎలిమినేట్ అయ్యాక BB బజ్ ఇంటర్వ్యూకి వచ్చిన అశ్వినిని గీతూ రాయల్ తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. అంతేకాకుండా నెటిజెన్స్ అసలు అశ్విని గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని చూపించగానే అశ్విని మొహం మాడిపోయింది.
అంతేకాకుండా హౌస్ లో అశ్విని ప్రియన్క విషయంలో, శివాజీ విషయంలో మాట్లాడుతూ ఫ్లిప్ చేసిన వీడియోస్ వేసి చూపించారు. అప్పుడు మరింత డల్ అయ్యింది, అంతేకాకుండా నెటిజెన్స్ ట్వీట్స్ డిస్ ప్లే చేసారు. అందులో అసలు అశ్విని నువ్వు బిగ్ బాస్ కి ఎందుకెళ్లావ్, పల్లవి ప్రశాంత్ కి భజన చేయడానికా అని ఓ నెటిజెన్ అడిగాడు. ఆ తర్వాత అసలు నిన్ను మేము హౌస్ లో ఎందుకు భరించాలి, నువ్వేం చేసావ్ అని మరో నెటిజెన్ అడిగాడు. దానికి అశ్విని నేను ఎందుకు హౌస్ లోకి వెళ్లానో మీకందుకు, నేను ఏం చేస్తే మీకెందుకు, నా గురించి మీకెందుకు అంది. వాళ్లే కదా మీకు ఓట్స్ వేసి ఇన్ని రోజులు హౌస్ లో ఉంచింది అనగానే అశ్విని చాలా ఫీలైపోతూ బాధపడిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.