Advertisement
TDP Ads

టీడీపీ దెబ్బకు.. బీఆర్ఎస్ అబ్బా..

Mon 27th Nov 2023 10:09 PM
tdp,brs  టీడీపీ దెబ్బకు.. బీఆర్ఎస్ అబ్బా..
TDP vs BRS టీడీపీ దెబ్బకు.. బీఆర్ఎస్ అబ్బా..
Advertisement

తెలంగాణ శాసనసభ ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకోవడం బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద మైనస్‌గా మారింది. అది ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యింది. నిజానికి ఒకవేళ టీడీపీ కానీ పోటీ చేసి ఉంటే బీఆర్ఎస్ నేతల స్వరం ఓ రకంగా ఉండేది. ఇప్పుుడ కాంగ్రెస్‌ను విమర్శించడానికి మాటలు వెతుక్కోవాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో ఉన్నాయి. అప్పట్లో ఆంధ్రోళ్ల పాలన మనకొద్దంటూ.. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే తిరిగి ఆంధ్రోళ్ల పాలనను కొని తెచ్చుకున్నట్టేనని ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టి బీఆర్ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు కూడా ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతోంది కానీ అనుకున్న స్థాయిలో అయితే వర్కవుట్ కావడం లేదు.

టీడీపీ ఎన్నికల నుంచి తప్పుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు పరోక్షంగా సహకరిస్తోందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే టీడీపీ ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. ఫలానా వారికి సపోర్ట్ చేయమని సైతం ఎవరికీ చెప్పలేదు. మా ఫోకస్ అంతా ఏపీపైనే అని స్పష్టం చేసింది. ఇంత చేశాక కూడా ఒకవేళ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా కూడా ఇక్కడ టీడీపీ అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ఎవరూ అనుకోరు. అసలు ఇక్కడి రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోదని జనం ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఢిల్లీ వాళ్ల పాలన అంటూ రెచ్చగొడుతున్నా కూడా ప్రాంతీయ వాదానికి పెద్దగా జనం తలొగ్గడం లేదు.  

అప్పట్లో అయితే టీడీపీ పోటీ చేసినందు వల్లనే బీఆర్ఎస్ లాభపడిందనడంలో సందేహం లేదు. కానీ ఈసారి టీడీపీ పోటీ చేయకపోవడంతో ఏం చేయాలో పాలుపోక బీఆర్ఎస్ మల్లగుల్లాలు పడుతోంది. గతంలో టీడీపీని బూచిగా చూపించినట్టుగా ఇప్పుడు దేనినీ చూపించలేకపోతోంది. మరోవైపు టీడీపీ సానుభూతిపరులంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇది గులాబీ బాస్‌కి మరింత కష్టంగా మారింది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సెటిలర్స్ ఎక్కువ. ఇక్కడ 24 సీట్లు ఉన్నాయి. వీటిలో మజ్లిస్-7 పక్కాగా ఆ పార్టీవే. ఇక బీఆర్ఎస్ కొన్ని.. ఒకటో అరో బీజేపీకి మిగిలినవన్నీ కాంగ్రెస్ పార్టీవేననడంలో సందేహం లేదు. తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ దెబ్బతో బీఆర్ఎస్ దాదాపు 20 సీట్లు కోల్పోవడం ఖాయమని సమాచారం.

TDP vs BRS:

All TDP sympathizers are leaning towards Congress party

Tags:   TDP, BRS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement