బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పూల్టా అంటూ కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు. అందులో భాగంగానే సీజన్ 7 మొదలైన నెల తర్వాత ఐదుగురు ఒకే రోజు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వడం, ఎలిమినేట్ అయ్యాక మూడు వారాల తర్వాత రతికా రీ ఎంట్రీ, ఒక వారం ఎలిమినేషన్ స్కిప్ చెయ్యడం, ఒక వారం డబుల్ ఎలిమినేషన్, అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్, నెంబర్ 1 స్థానాల టాస్క్ ఇవన్నీ ఉల్టా పూల్టాలో భాగమే. ఇక టాప్ 2 లో నిన్నటివరకు ఇద్దరు ఉంటే.. ఈరోజు ఆ ఇద్దరిలో ఒకరు అవుట్.. మరొక కొత్త కంటెస్టెంట్ ఇప్పుడు ఆ ప్లేస్ లోకి వచ్చారంటూ ఓటింగ్స్ పోల్స్ చెబుతున్నాయి.
గత ఐదారు వారాలుగా శివాజి, పల్లవి ప్రశాంత్ టాప్ 2 లోనే కొనసాగుతున్నారు. కానీ రెండు వారాలుగా అసలు టాప్ 5 లో కూడా ఉండడు అనుకున్న అమర్ దీప్ ఇప్పుడు నామినేషన్స్ లో ఉంటే ఏకంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటున్నాడు. ఇక నాగార్జున శివాజీ విషయం మొత్తం బయట పెట్టడంతో ఇప్పుడు శివాజీ గ్రాఫ్ పడిపోయి శివాజీ స్థానంలోకి లో అమర్ దీప్ వచ్చేసాడు. శివాజీ పీఆర్ టీం బాగా పని చెయ్యడం, పల్లవి, యావర్ అభిమానులు కూడా శివాజీకి సపోర్ట్ చెయ్యడం, హౌస్ లో సెటిల్డ్ గా ఆడడం, మిగతా హౌస్ మేట్స్ ని తొక్కేయ్యడం ఇలా ప్రతి విషయంలో శివాజీ మొదటి నుంచి స్ట్రాంగ్ అయ్యి కూర్చున్నాడు.
కానీ అమర్ దీప్ విషయంలో శివాజీ చేసిన పని బయట చాలామంది ఒప్పుకోవడం లేదు. అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా ఉండడం కోసం శివాజీ ఏవేవో కథలు చెప్పి ఇప్పుడు అర్జున్ దృష్టిలో విలన్ అయ్యి చివరికి హౌస్ లో సగం మందికి టార్గెట్ అయ్యాడు. ప్రస్తుతం అమర్ దీప్ కి సింపతీ కనిపిస్తే.. శివాజీకి నెగిటివిటి కనిపిస్తుంది. అలా శివాజీ ఉండాల్సిన స్థానంలోకి అంటే టాప్ 2 లో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లు ఉన్నారు. అమర్ దీప్ అయితే ఏకంగా టైటిల్ రేస్ లోకి రావడం ఇంకా షాకిచ్చే విషయం.