బిగ్ బాస్ సీజన్ 7 ఆల్మోస్ట్ చివరి వారాలకు వచ్చేసింది. ఈవారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అశ్విని, రతికా ఎలిమినేట్ అయ్యారు. 12 వ వారం ముగిసి 13 వ వారంలోకి అడుగుపెట్టాక కూడా హౌస్ మేట్స్ లో ఫైర్ తగ్గలేదు. ఈరోజు సోమవారం నామినేషన్స్ వేడి మరోసారి హౌస్ ని హీటెక్కించింది. ముఖ్యంగా హౌస్ మేట్స్ చాలామంది శివాజీని టార్గెట్ చేసారు. శివాజీ నాటకాన్ని నాగార్జున వీడియోస్ వేసి ప్లే చెయ్యడంతో శివాజీ కన్నింగ్ గేమ్ పై హౌస్ మేట్స్ అవాక్కయ్యారు.
అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా మోసం చెయ్యడంతో ఆ సింపతీ అమర్ కి క్రియేట్ అయ్యింది. బయట అతని గ్రాఫ్ పెరిగిపోతుంది. ఈ వారం శోభా శెట్టి పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసింది. గౌతమ్, ప్రియాంక, అమర్, అర్జున్ వీళ్లంతా శివాజీని కార్నర్ చేసారు. అమర్ గౌతమ్ ని కూడా వదల్లేదు. శోభా శెట్టి ఎప్పటిలాగే యావర్ తో పాటుగా ఈసారి పల్లవి ని నామినేట్ చేసింది. అయితే ఎక్కువగా శివాజీకి నామినేషన్స్ పడినాయి. పల్లవి ప్రశాంత్, యావర్ లతో తాను ఇకపై ఉండబోను అంటూ శివాజీ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఈ వారం ఆ సింపతీ క్రియేషన్ లో భాగంగా అమర్ దీప్ ని ఎవరూ టార్గెట్ చెయ్యకుండా ఉండడం గమనార్హం. ఒకప్పుడు హౌస్ లో, టాస్క్ ల్లో బాగా డల్ అయిన అమర్ కి అప్పట్లో బయట కూడా నెగిటివిటి ఎక్కువైంది. కానీ గత మూడు వారాలుగా హౌస్ లోను, బయట అమర్ దీప్ గ్రాఫ్ పెరిగింది. అలాగే శివాజీ మోసానికి బలైన అమర్ అనే ట్యాగ్ తో ఈసారి అమర్ ని ఎవరూ పట్టించుకోకుండా అతన్ని నామినేట్ చెయ్యకుండా వదిలేసినట్లుగా తెలుస్తోంది. ఒక్క అమర్ తప్ప హౌస్ లో ఉన్న మిగతా ఏడుగురు ఈరోజు నామినేషన్స్ లోకి వెళ్లిన వాళ్లలో ఉన్నారు.