Advertisementt

పెళ్ళిపై మిల్కి బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆన్సర్

Mon 27th Nov 2023 05:01 PM
vijay varma  పెళ్ళిపై మిల్కి బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆన్సర్
Milky beauty boyfriend answer on marriage పెళ్ళిపై మిల్కి బ్యూటీ బాయ్ ఫ్రెండ్ ఆన్సర్
Advertisement
Ads by CJ

మిల్కి బ్యూటీ తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో త్వరలోనే ఏడడుగులు నడవబోతుంది.. వారి పెళ్ళికి పెద్దలు ముహూర్తం కూడా పెట్టేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. విజయ్ వర్మ-తమన్నా రెండు ఫామిలీస్ వీరి పెళ్ళికి ఏర్పాట్లు మొదలు పెట్టేసారు. అతి త్వరలోనే వీరు వివాహం చేసుకోబోతున్నారంటున్నారు. ఇదే విషయాన్ని విజయ్ వర్మని బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది.

దానికి విజయ్ వర్మ తమన్నా తో పెళ్లి విషయం గురించి షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తాను తమన్నాని ఎప్పుడు వివాహం చేసుకుంటానో కనీసం మా అమ్మకే చెప్పలేదు, ఇప్పుడు నేను తమన్నాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నానో అనే విషయం మీడియాకి ఎలా చెబుతాను అంటూ దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చాడు. దానితో మీడియా కామైపోయింది. మరి గతంలోనూ తమన్నా తాము ప్రేమలో ఉన్నాము, అలాగే ఎవరి ప్రొఫెషన్ లో వాళ్ళు బిజీగా వున్నాము, అప్పుడే పెళ్లి చేసుకోమని తెగేసి చెప్పింది.

ఇప్పుడు విజయ్ వర్మ కూడా తమ పెళ్లి విషయాన్ని సూటిగా చెప్పి షాకిచ్చాడు. అంటే దీనిని బట్టి విజయ్ వర్మ, తమన్నాలు ఇప్పుడప్పుడే వివాహం చేసుకునేలా అయితే కనిపించడం లేదు. 

Milky beauty boyfriend answer on marriage:

Vijay Varma About Marrying Tamannaah

Tags:   VIJAY VARMA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ