Advertisementt

గుంటూరు కారం సెట్స్ లో మహేష్

Mon 27th Nov 2023 04:08 PM
guntur kaaram  గుంటూరు కారం సెట్స్ లో మహేష్
Mahesh in Guntur Kaaram sets గుంటూరు కారం సెట్స్ లో మహేష్
Advertisement
Ads by CJ

గుంటూరు కారం షూటింగ్ లో తలమునకలైన మహేష్ బాబు ఈరోజు తన నెక్స్ట్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో కలిసి పబ్లిక్ ఈవెంట్ లో సందడి చెయ్యబోతున్నారు. బాలీవుడ్ మూవీ యానిమల్ హైదరాబాద్ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారు. రాజమౌళితో కలిసి ఆయన ఒకే స్టేజ్ పై కనిపిస్తే ఆ కాంబినేషన్ మూవీపై ఏమైనా అప్ డేట్ వస్తుందేమో అనే ఆశలో మహేష్ బాబు ఫాన్స్ ఉన్నారు. 

మరోపక్క గుంటూరు కారం షూటింగ్ లో మహేష్ గొడుగు పట్టుకుని నడుస్తుంటే వెన్నెల కిషోర్ ఆయన వెనుకగా ఉన్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు రఫ్ లుక్ లో చేతిలో గొడుగుతో కాస్త కొత్తగా కనిపించాడు. మరి మహేష్ బాబు గుంటూరు కారంలో గరంగా గరంగా మాస్ లుక్ లోనే కనిపిస్తాడని మేకర్స్ ఎప్పటినుంచో వదులుతున్న లుక్స్, సాంగ్స్ తో క్లారిటీ ఇస్తూనే ఉన్నారు. ఇక గుంటూరు కారం సెట్స్ లో మహేష్ ని అలా చూసిన ఆయన ఫాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు

ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్న గుంటూరు కారం సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. ఎలాగైనా సంక్రాంతికి విడుదల చెయ్యాలని త్రివిక్రమ్ కసిగా పని చేస్తున్నారు. మహేష్ కూడా గత రెండు నెలలుగా బ్రేక్ తీసుకోకుండా కష్టపడుతూన్నాడు. 

Mahesh in Guntur Kaaram sets:

Mahesh Guntur Kaaram update 

Tags:   GUNTUR KAARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ