Advertisementt

గూస్ బంప్స్ తెప్పిస్తున్న కాంతార చాప్టర్ 1

Mon 27th Nov 2023 02:00 PM
kantara chapter 1  గూస్ బంప్స్ తెప్పిస్తున్న కాంతార చాప్టర్ 1
Kantara Chapter 1 First Look out గూస్ బంప్స్ తెప్పిస్తున్న కాంతార చాప్టర్ 1
Advertisement
Ads by CJ

గతేడాది రిలీజై బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచిన కన్నడ కాంతార సినిమాకు ప్రీక్వెల్​గా వ‌స్తున్న కాంతార చాప్టర్ 1 పై ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయ్. కాంతార ప్రీక్వెల్ ప్రకటించాక రిషబ్ శెట్టి దానిని ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. రిషబ్ ఎక్కడ కనిపించినా ఆ అప్ డేట్ కోసమే అడుగుతున్నారు. తాజాగా రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 లుక్ మాత్రమే కాదు.. టీజర్ కూడా వదిలి గూస్ బంప్స్ తెప్పించారు .

కాంతార చాప్టర్ 1 టీజర్ లోకి వెళితే..  రిషబ్ శెట్టి క్లైమాక్స్ సీన్‌తో ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ మొద‌లుకాగా.. కదంబాల పాలన సమయంలో ఒక లెజెండ్‌ జన్మించాడు అంటూ కండలు తిరిగిన దేహంతో.. బాడి అంతా రక్తపు మరకలు బీభత్సంగా ఉన్న తండ్రి పాత్రలో ఉన్న రిషబ్ శెట్టి లుక్ తో అదరగొట్టేసాడు. తన ఇంటెన్స్‌ లుక్‌తో అందరినీ భయపెట్టాడు. ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఖడ్గంతో ఒక బావిలో నిలబడి కనిపించాడు రిషబ్‌ శెట్టి. 

ఇక ఈ సినిమా కోసం రిషబ్‌ శెట్టి గ్రౌండ్‌వర్క్‌ బాగా చేసిన‌ట్లుగా తెలుస్తుంది.. కాంతారని 16 కోట్లలోపే ముగించిన రిషబ్‌ శెట్టి ప్రీక్వెల్‌ కోసం ఏకంగా 120 కోట్ల బడ్జెట్‌ను ప్లాన్‌ చేసినట్లుగా టాక్. ఆ బడ్జెట్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే రిషబ్ 20 కోట్లు కేటాయించినట్లుగా ఓ వార్త అయితే సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. అజ్నిశ్ లోకనాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.

Kantara Chapter 1 First Look out:

Kantara Chapter 1 First Look and Teaser out

Tags:   KANTARA CHAPTER 1
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ