హీరో రవితేజ వరస ప్లాప్స్ లో ఉన్న సమయంలో గోపీచంద్ మలినేని దర్శకతంలో క్రాక్ చేసి ట్రాక్ లో పడ్డాడు. క్రాక్ సినిమా సూపర్ హిట్ అవడంతో రవితేజ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే ఆ తర్వాత రవితేజ మూస కథలతో సినిమాలు చేసి వరసగా ప్లాప్స్ కొడుతున్నాడు. ధమాకా కూడా హీరో శ్రీలీల డాన్స్ లతోనే భారీ హిట్ అయ్యింది. ఇక మళ్ళీ గోపీచంద్ మలినేనితో రవితేజ మరో భారీ బడ్జెట్ మూవీ మొదలు పెట్టాడు. అది పూజా కార్యక్రమాలతో మొదలయ్యాక రవితేజ నటించిన ప్యాన్ ఇండియా ఫిల్మ్ టైగర్ నాగేశ్వరావు అట్టర్ ప్లాప్ అవడంతో గోపీచంద్ - రవితేజ కలయికలో సినిమా చెయ్యాలనుకున్న మైత్రి వారు రవితేజ విషయంలో వెనక్కి తగ్గారు.
దానితో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ చెయ్యాల్సిన మూవీ నుంచి రవితేజని తప్పించారు. రవితేజ పారితోషకం విషయంలో పట్టు బట్టడంతోనే ఈప్రాజెక్టు లోకి మరో హీరోని వెతికే ప్రాసెస్ లోకి మేకర్స్ వెళ్లారంటూ సోషల్ మీడియాలో గుసగుసలు గుప్పుమన్నాయి. అయితే రవితేజ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ నుంచి లేదా తమిళ్ నుంచి సీనియర్ హీరోల్లో ఎవరో ఒకరిని గోపీచంద్ ప్రాజెక్ట్ కోసం మైత్రి వారు సెట్ చేస్తున్నారన్నారు. తాజాగా రవితేజ ప్లేస్ లో గోపీచంద్ కి హీరో దొరికినట్లుగా ప్రచారం మొదలైంది.
అది తమిళ స్టార్ హీరో అజిత్ ని గోపీచంద్ తో చెయ్యబోయే ప్రాజెక్ట్ లోకి మైత్రి వారు తీసుకొచ్చారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. అంటే గోపీచంద్ మలినేని-అజిత్ కలయికలో మైత్రి వారు కొత్తగా సినిమా మొదలు పెట్టబోతున్నారనేగా ఈన్యూస్ కి అర్ధం. ఇందులో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.