బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకి ముహూర్తం కుదిరింది. డిసెంబర్ 17 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే మొదలు కాబోతుంది. ఈసారి టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారో అనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నా అందరి మైండ్ లో ఒకటే నడుస్తుంది. అది రైతు బిడ్డగా హౌస్ లోకి ఎంటర్ అయ్యి తనదైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ విన్నర్ అవుతాడని, బిగ్ బాస్ 7 టైటిల్ పట్టుకుపోతాడని. ఇక రన్నర్ గా శివాజీ నిలుస్తాడనే మాట సోషల్ మీడియాలో గట్టిగానే వినిపిస్తోంది.
అయితే గత మూడు వారాలుగా సీరియల్ యాక్టర్ అమర్ దీప్ తన గ్రాఫ్ ని పెంచుకుంటున్నాడు. హౌస్ లోకి టైటిల్ ఫేవరేట్ గా ఎంటర్ అయిన అమర్ దీప్ తర్వాత వారాల్లో చాలా నీరసంగా, వీక్ కంటెస్టెంట్ గా మారాడు. దానితో అతను ఈ సీజన్ విన్నర్ అవడం కష్టమని తేల్చేసారు. కాని గత మూడు వారాలుగా అమర్ క్రేజ్ బయట బాగా పెరిగింది. ఓటింగ్ లో శివాజీ బ్యాచ్ కి షాకిస్తూ ముందంజలో ఉన్నాడు. అయినప్పటికీ అమర్ దీప్ టైటిల్ విన్నర్ అవడం మాటలు కాదు.
అయితే నిన్న శనివారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యి ఇప్పుడు ఫీలవుతూ నేను సెల్ఫ్ నామినేషన్ కి వెళ్లడమే తప్పైపోయింది అని చెబుతున్న అశ్విని.. ఈ సీజన్ విన్నర్ ఎవరో తేల్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ ఉంటాడని చెప్పిన అశ్విని రన్నర్ గా శివాజీ గెలుస్తాడని చెప్పింది. మరి బయట ఉన్న సోషల్ మీడియా టాక్ నే అశ్విని కూడా చెప్పడంతో ఈ సీజన్ విన్నర్ టైటిల్ ని పల్లవి ప్రశాంత్ ఎగరేసుకెళ్ళడం ఖాయమనే అభిప్రాయానికి బుల్లితెర ప్రేక్షకులు వచ్చేస్తున్నారు.