యంగ్ హీరో నాగ శౌర్య వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గత ఏడాది అనుష్కని ప్రేమ వివాహం చేసుకున్న నాగ శౌర్య తమ మొదటి వెడ్డింగ్ యానివర్శిని తన ఇంట్లోనే ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన సెలబ్రేట్ చేసుకున్నాడు. నాగ శౌర్య తల్లి ఉష నిర్మాతగానే కాదు.. ఇప్పుడు ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. ఉష ముళ్ళపూరి కొత్తగా హైదరాబాద్ లో రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేసారు. ఉష మూలపూరి కిచెన్ పేరుతో ప్రారంభించిన రెస్టారెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది.
పలు యూట్యూబ్ ఛానల్స్ ఉష మూలపూరి కిచెన్ ని విజిట్ చేసి ఉషాగారిని ఇంటర్వూస్ చేస్తున్నారు. వైరల్లీ ఫుడ్ ఇంటర్వ్యూ తర్వాత తమ బిజినెస్ బాగా పెరిగింది అని, ఈ రెస్టారెంట్ మొదలు పెట్టి నెలన్నర గడిచింది, వైరల్లీ ఫుడ్ వచ్చాక తమకి ఖాళీ లేదు, మా రెస్టరెంట్ కి బాగా డిమాండ్ పెరిగింది, పలువురు సెలెబ్రిటీస్ ఈ రెస్టారెంట్ కి వస్తున్నారు, నిన్ననే జూనియర్ ఎన్టీఆర్ కి మా రెస్టారెంట్ నుంచి పార్సిల్ వెళ్ళింది అని ఉషగారు చెప్పారు. అవునా ఎన్టీఆర్ కి పంపిన ఆ ఫుడ్ ఏమిటి అని సదరు యాంకర్ అడగగా.. ఎన్టీఆర్ గారికి మటన్ బిర్యానీ అంటే ఇష్టం, అదే ఆర్డర్ పెట్టగా ఆయన డ్రైవర్ వచ్చి పార్సిల్ తీసుకుని వెళ్ళినట్టుగా ఉష చెప్పారు.
ఇంకా చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నారని, తాము కిచెన్ ని చాలా నీట్ గా, ఇంట్లో ఉన్నట్లుగానే మైంటైన్ చేస్తున్నామని, ప్రస్తుతం అర క్షణం ఖాళీ లేదు, మేడ్స్ ని, వంట మాస్టర్స్ ని గైడ్ చేస్తున్నట్టుగా ఉష మూలపూరి యూట్యూబ్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వూస్ లో చెప్పుకొచ్చారు.