డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా డైనోసార్ దిగేందుకు మేకర్స్ సర్వం సిద్ధం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు అభిమానులని బాగా వెయిట్ చేయించిన సలార్ మేకర్స్ ఇప్పుడు సలార్ విషయంలో పక్కా ప్లానింగ్ తో రాబోతున్నారు. డిసెంబర్ 1 న రాబోయే సలార్ ట్రైలర్ తో అసలైన సందడి స్టార్ట్ కాబోతుంది. #Salaar ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో పలువురు చేస్తున్న ట్వీట్స్ కి ప్రభాస్ ఫాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
ఇక సలార్ ప్రమోషన్స్ స్టార్ట్ చెయ్యడానికి ప్రశాంత్ నీల్ అలాగే ప్రభాస్ రెడీ అవుతున్నారట. డిసెంబర్ మొదటి వారం నుంచి సలార్ ప్రమోషన్స్ షెడ్యూల్ మొదలు కాబోతుంది అని, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ఇలా ఏ భాషల ఆడియన్స్ ని వదలకుండా సలార్ ని ప్రమోట్ చేసేందుకు ప్రశాంత్ నీల్ మేకర్స్ తో కలిసి ప్లాన్ చేసుకుంటున్నాడట. ప్రభాస్ కూడా వీలైనన్ని ఇంటర్వూస్ ఇస్తారని, సినిమాని ఎంతగా ప్రమోట్ చెయ్యాలో అంతగా ప్రేక్షకుల్లోకి తీసుకుని వెళ్లాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట.
సలార్ ట్రైలర్ వచ్చాక సినిమాపై మరింతగా హైప్ పెరుగుతుంది అని, ట్రైలర్ తర్వాత చిన్నపాటి గ్యాప్ తో సాంగ్స్ వదులుతారని, ఆ తర్వాత సలార్ ప్రమోషన్స్ వేరే లెవల్ అనేలా నిర్వహించేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారట.