తెలంగాణలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. మరో పది రోజుల్లో తెలంగాణలో పాత ప్రభుత్వమే కొత్తగా అధికారాన్ని ఏర్పాటు చేసుకోవడమో.. లేదంటే మరో కొత్త పార్టీలో అధికారంలోకి రావడమో జరుగుతుంది. ఎన్నికలకు కేవలం మూడు రోజులే సమయం ఉంది. ఇక ప్రచారం కూడా ఆఖరి ఘట్టానికి చేరుకుంది. పార్టీలన్నీ ఎవరి ధీమాలో వాళ్లు ఉన్నారు. కానీ అన్ని పార్టీలను కలవరపెడుతున్న కామన్ పాయింట్ ఒక్కటే. ఇండిపెండెంట్లు.. స్వతంత్ర అభ్యర్థులు ఎవరి ఓట్లను చీలుస్తారనే టెన్షన్ ప్రధాన పార్టీల్లో నెలకొంది.
ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సారి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో.. 991 మంది అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం గమనార్హం. ఈ 991 మంది అభ్యర్థులు ఎవరికి వేటు వేస్తారోననే భయం సర్వత్రా నెలకొంది. వీళ్ల వల్ల భారీగా ఓట్ బ్యాంక్ చీలిపోయే ప్రమాదముంది. తెలంగాణ వచ్చాక ఇంత పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగడం ఇదే తొలిసారి. 2014లో 668 మంది అభ్యర్థులు.. 2018లో 675 మంది స్వతంత్రులు పోటీ చేశారు. ఈ రెండు ఎన్నికల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా ఇండిపెండెంట్లకు 16 లక్షల 4 వేల ఓట్లు పోలయ్యాయి. ఈ ఓట్లన్నీ ప్రధాన పార్టీలకు పడాల్సినవే కదా.
ఈసారి ఏకంగా 991 మంది అభ్యర్థులంటే.. ఎన్ని ఓట్లు చీలుతాయో.. ఎన్ని ఓట్లు వారికి పడతాయోననేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఓటు బ్యాంకు అయితే భారీగా చీలడం ఖాయం. ప్రస్తుతానికి సిట్యువేషన్ అయితే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉంది. ఈసారి బీఎస్పీ, బీజేపీ కూటమితో జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. పార్టీలన్నీ కూడా ఒకటిని మించిన మేనిఫెస్టోతో ఒకటి సిద్ధమయ్యాయి. ఈసారి పోటీ చేసే పార్టీలు ఎక్కువయ్యాయి.. అలాగే స్వతంత్ర అభ్యర్థులు సైతం పెరిగారు. దీంతో ఓటు బ్యాంకు భారీగా చీలే అవకాశం ఉంది. పార్టీలన్నీ స్వతంత్రుల అభ్యర్థుల విషయంలో తెగ కంగారు పడుతున్నాయి.