బిగ్ బాస్ లో చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న శివాజీ హౌస్ లో ఫిజికల్ గానే కాదు, మైండ్ గేమ్ తో చాలామంది హృదయాలకు దగ్గరయ్యాడు. కొద్దిరోజులుగా విన్నర్ అయ్యే కళ ఎక్కువగా శివాజీలో కనిపిస్తుంది. మొదట్లో మాట్లాడితే హౌస్ నుంచి పంపించెయ్యండి బిగ్ బాస్ అనే శివాజీ ఇప్పుడు సెటిల్డ్ గా ఆడుతున్నాడు. అయితే కొద్దిరోజుల క్రితం శివాజీకి ఓ టాస్క్ లో భుజానికి గాయమైంది. ఆ గాయం అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది. గాయం వల్ల ఆడలేకపోతున్నావ్ అంటూ అమర్ దీప్ అతన్ని కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించగానే శివాజీ మరోసారి బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోతా అంటూ హడావుడి చేసాడు.
తర్వాత బిగ్ బాస్, నాగార్జున సర్ది చెప్పి డాక్టర్స్ తో చెకప్స్ చేయించారు. ఆ తర్వాత ఓ టాస్క్ లో అమర్ గట్టిగా గుద్దడంతో శివాజీ చెయ్యి సెట్ అయ్యింది. అప్పటినుంచి అతని గాయం అతన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ తాజాగా బ్రిక్స్ టాస్క్ లో శివాజీ చేతికి దెబ్బతగిలి గాయం తిరగబెట్టింది. ఆ దెబ్బకి శివాజీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి మీకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ మీ రిపోర్ట్స్ ని మరికొంతమంది స్పెషలిస్ట్ లకి చూపించారు. అందులో ఓ డాక్టర్ మీ చేతి దెబ్బ తీవ్రమైంది కాదు.. నెమ్మదిగా తగ్గుతుంది, ప్రస్తుతం పెద్ద ప్రాబ్లెమ్ లేదు అని చెప్పారు. మరో ఇద్దరు డాక్టర్స్ దెబ్బ మానెటప్పుడు రెస్ట్ అవసరం, మళ్ళీ టాస్క్ అవి ఆడితే ఇబ్బందిపడతారని చెప్పారు. మెజారిటీ డెసిషన్ తర్వాత మీరు హౌస్ లో ఉండాలో, వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పాడు.
దానితో శివాజీ నాకు రెండు మూడు గంటల టైమ్ ఇవ్వండి నా డెసిషన్ చెబుతాను అన్నాడు. ఆ తర్వాత నేను బిగ్ బాస్ లో ఉంటాను, నా భుజానికి ఏమైనా నాదే బాధ్యత నేను హౌస్ లో ముందుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను అన్నాడు, ఇకపై గేమ్ మరింత కష్టంగా ఉంటుంది.. మీరు ఉండగలరా అని బిగ్ బాస్ అడిగాడు, ఉంటాను అంటూ శివాజీ చెప్పాడు. శివాజీ హెల్త్ పై ఆయన అభిమానుల్లో, ఫ్యామిలిలో కూడా కాస్త ఆందోళన కనబడుతుంది.