సమంత ఖుషి షూటింగ్ తర్వాత మళ్ళీ సెట్స్ లో కనిపించలేదు కాని.. మధ్య మధ్యలో షాప్ ఓపెనింగ్స్, తన ఓన్ వస్త్ర బ్రాండ్ సాకి కోసం స్పెషల్ ఫొటోషూట్స్ చేస్తుంది. కొన్నాళ్లుగా హెల్త్ రీజన్స్ తో నటనను పక్కనబెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమంత గతంలో ఎప్పుడూ జిమ్ లోనే కనిపించేది. ఫిట్ నెస్ కోసం జిమ్ లో కష్టపడేది. వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ చూపించేది. ఇక హెల్త్ ప్రోబ్లెంస్ వచ్చినా సమంత వర్కౌట్స్ మానలేదు.
కొన్నాళ్లుగా సైలెంట్ గా కనిపిస్తున్న సమంత మళ్ళీ వర్కౌట్ వీడియోస్ ని షేర్ చేస్తూ జిమ్ లో చమటోడ్చిన వీడియోస్ ని పోస్ట్ చేస్తుంది. ఇక సాకి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ గా ఫోటో షూట్స్ మొదలు పెట్టింది. శారీస్ లో స్పెషల్ షూట్స్ చేయించుకుంటుంది. అయితే సమంత ఎంతగా వర్కౌట్స్ చేసినా.. ఆమె ఫేస్ లో గ్లో మాత్రం మిస్ అయ్యింది. శాకుంతలం, ఖుషి మూవీస్ లో సమంత లుక్స్ పై విమర్శలొచ్చాయి.
ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ లేవు, అంతేకాకుండా కాంతిహీనంగా కనిపించింది అన్నారు. సమంత ఫిట్ నెస్ తో పాటుగా లుక్స్ పై కూడా శ్రద్ద పెట్టాలి అంటూ ఆమెకి సలహాలు పారేస్తున్నారు. ప్రస్తుతం సమంత ఇంకా ఎలాంటి కథలు వినడం కాని, ఏ ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యడం కాని చెయ్యడం లేదు.